Pawan Kalyan : ప‌వ‌న్ భార్య త‌న పిల్ల‌ల‌తో సింగ‌పూర్‌లో సెటిల్ అయిందా ?

November 3, 2021 11:09 PM

Pawan Kalyan : సినీ న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి సంబంధించిన ఏ విష‌యం అయినా అభిమానుల‌కి ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. ఇప్పుడు రాజ‌కీయాల‌లో ఉన్నారు కాబ‌ట్టి ఆయ‌న‌పై ప్ర‌తిప‌క్షాలు దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. అయితే ఏది ఎలా ఉన్నా ప‌వ‌న్ క‌ళ్యాణ్ నీతిగా, నిజ‌యితీగా ఉండేందుకే ఎక్కువ‌గా కృషి చేస్తున్నారు. తాజాగా ప‌వ‌న్‌కి సంబంధించిన ఓ వార్త తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Pawan Kalyan wife anna lezhneva reportedly settled in singapore with kids

ప‌వ‌న్.. రేణూ దేశాయ్ నుండి విడిపోయిన త‌ర్వాత అన్నాలెజినోవాని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆమె ఈ మ‌ధ్య ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు, ఆమె గురించిన వార్తలు ఏమీ వినిపించ‌డం లేదు. తాజా సమాచారం ప్రకారం. అన్నా గత కొన్ని నెలలుగా రష్యాలోనే వుంటున్నారని తెలుస్తోంది. ఆమె తమ పిల్లలను సింగపూర్ లేదా మరో చోట చదివించే ఆలోచనలో ఉన్నారని, అందుకే కొంతకాలంగా అక్కడే ఉంటున్నారని తెలుస్తోంది. విదేశీ విద్య అందించేందుకు ప‌వ‌న్ తాప‌త్ర‌య ప‌డుతున్న నేప‌థ్యంలో వారు గ‌త కొద్ది రోజులుగా అక్క‌డే ఉంటున్నార‌ని స‌మాచారం.

మెగా కుటుంబంలో జరిగే అన్ని కార్యక్రమాలకు అన్నా హాజరవుతూనే ఉంటుంది. శ్రీజ పెళ్లితోపాటు ఆమె కూతురు అన్న ప్రాసన వేడుకలో కూడా కనిపించిన అన్నా లెజినోవా.. నాగబాబు కూతురు పెళ్లిలో క‌నిపించ‌లేదు. అప్పుడు పవన్ ఒక్కడే వచ్చారు. ఆ స‌మ‌యం నుండే అన్నా ఇండియాలో లేదని తెలుస్తోంది. ఇక ప‌వ‌న్ ప్ర‌స్తుతం సినిమాలు, రాజ‌కీయాల‌తోనే బిజీబిజీగా ఉంటున్నారు. ప‌వ‌న్ న‌టించిన భీమ్లా నాయ‌క్ సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment