Pawan Kalyan : ప‌వ‌న్ క‌ల్యాణ్ వాచ్‌, షూస్ అస‌లు ధ‌రలు ఇవీ.. అన‌వ‌స‌రంగా ట్రోల్ చేస్తున్నారే..!

Pawan Kalyan : సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు చేస్తున్న హడావుడి చూస్తుంటే.. కాదేదీ ట్రోలింగ్‌కి అనర్హం అనిపిస్తోంది. ఏ విషయమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ వస్తువైనా.. ఇలా ఏదైనా సరే.. ట్రోల్ చేయడానికి వెనుకాడటం లేదు.. అంతగా సోషల్ మీడియాని వారు వాడుతున్నారు. ఇటీవల రాహుల్ గాంధీ వేసుకున్న టీ షర్ట్‌పై బీజేపీ శ్రేణులు ట్రోలింగ్‌కు దిగితే.. ప్రధాని మోడీ కాస్ట్యూమ్స్ మార్చే తీరుపై కాంగ్రెస్, ఇతర పార్టీలు ట్రోలింగ్ నడిపాయి. సరే, అవి పాలిటిక్స్ అనుకుంటే.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి, అందులోని వ్యక్తుల గురించి.. సోషల్ మీడియాలో నిత్యం ఏదో విధంగా ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ పవన్ కళ్యాణ్ వెరీ లగ్జరీ అనే ట్రోలింగ్ నడుస్తుంది.

పొలిటికల్ మీటింగ్‌లలో పవన్ కళ్యాణ్ నేత వస్త్రాలు ధరించి.. ర‌బ్బరు చెప్పులు వేసుకుని.. మట్టిపిడతల్లో పెరుగు అన్నం తింటూ చాలా సింపుల్‌గా కనిపిస్తారే.. మరి ఈ లగ్జరీ లైఫ్ ఏంటి ? అంటే.. అదే మరి పాలిట్రిక్స్ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఆయన రెడ్ టీ షర్ట్‌లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అందులో పవన్ కళ్యాణ్ చేతికి వాచ్ ఉంది.. అలాగే ఎదురుగా షూ కూడా ఉంది. దీంతో ఆ వాచ్ ఖరీదు ఎంత ? ఆయన వేసుకున్న షూ ఖరీదు ఎంత అంటూ వెతుకులాట మొదలుపెట్టారు. ఆ పోస్టర్‌లో కనిపించే వాచ్ ఖరీదు దాదాపు 14 లక్షల 37 వేలు. ఇక షూస్ ధర అయితే 10 లక్షలు అని ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. దీని ధర 119.94 యూరోలుగా ఉంది.

Pawan Kalyan

వాటిని ఇండియన్ కరెన్సీలో చూస్తే పది లక్షలు అవుతుంది. అయితే డచ్ లాంగ్వేజ్ ప్రకారం ఫుల్ స్టాప్‌ను కామాగా రాస్తుంటారు. నిజానికి ఆ షూ ధర దాదాపు 119 యూరోస్. ఆ లెక్కన చూస్తే పవన్ కళ్యాణ్ వేసుకున్న షూ ధర రూ.9,600 మాత్రమే కానీ.. పది లక్షలు అంటూ ట్రోల్ చేస్తున్నాయి. అయితే కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అత్యుత్సాహంతో మా హీరో వేసుకున్న షూ ఎంతో తెలుసా ? రూ.10 లక్షలు అని గర్వంగా చెప్తుంటే.. మీ హీరో ఈఎంఐలు కట్టలేక కార్లు అమ్మేశానని అంటాడు అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ కామెంట్స్‌కు, ట్రోలింగ్‌కు కొందరు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ.. ఆయన ఒక్కో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలియదా. షూస్, వాచ్ అంటూ కూడా ఆయనపై ట్రోలింగ్‌కు దిగుతున్నారేంట్రా ? మీ దుంపలు పిలకెయ్య.. ఏం పోయే కాలం రా మీకు.. అంటూ పవన్ కల్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM