Pawan Kalyan : సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరైన విషయం తెలిసిందే. ఆ ఈవెంట్‌లో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి పవర్ స్టార్ ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేశాడో మనం చూసాం. జగన్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడాడు. ఈ ఈవెంట్ తర్వాత ఫిలిం ఛాంబర్.. పవన్ వ్యాఖ్యలకు, తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రెస్ నోట్ విడుదల చేసింది. కొందరు నిర్మాతలు కూడా పవన్ వ్యాఖ్యలను తప్పు పట్టారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో సినిమా ఈవెంట్‌కి గెస్ట్‌గా వస్తాడనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి.. శర్వానంద్ – బొమ్మరిల్లు సిద్ధార్థ్ ప్రధాన పాత్రలలో మహా సముద్రం సినిమా తెరకెక్కించాడు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
అక్టోబర్ 9 ఆదివారం సాయంత్రం 6 గంటలకు JRC కన్వెన్షన్ హాల్ లో ఈ కార్యక్రమం జరుగనుందని చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ను చీఫ్ గెస్ట్ గా తీసుకురావాలని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. పవన్ ఓకే అంటే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వాలని చూస్తున్నారట. ఈ ఫంక్షన్‌కి పవన్ వస్తే రిపబ్లిక్ ఈవెంట్ తరహాలో అదరగొడతాడా లేదంటే సినిమా గురించి మాట్లాడి వెళతారా అన్నది తేలాల్సి ఉంది. ‘మహా సముద్రం’ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…