Pawan Kalyan : అర్జెంట్‌గా అమెరికాకు ప్ర‌యాణం అయిన ప‌వ‌న్‌.. కార‌ణం అదే..?

Pawan Kalyan : ఈ దసరా నుంచి ఆంధ్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ప్రారంభిస్తానని ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ మంగళవారం జనసేన మీటింగ్ తర్వాత అనూహ్యంగా తన యాత్రను వాయిదా వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో చివరి ఏడాది బస్సు యాత్ర చేపట్టడానికి రంగం సిద్ధం చేశారు. ఏపీ మొత్తం సందర్శించడానికి ప్రణాళిక సిద్ధం  చేసుకున్నారు. చివరి 6 నెలలు ప్రజలతో ఒకడిగా ఉండాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని.. జగన్ ను ఓడించడమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారు.

పవన్ కళ్యాణ్ ఎన్నికలలో గెలుపు దిశగా తన రంగం సిద్ధం చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు. ఇక సినిమాల విషయంలో కూడా తనకు సంబంధించిన పనులన్నీ చకచకా పూర్తి చేసుకుంటున్నారు. బస్సు యాత్రకు బ్రేక్ పడటంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్న సినిమాలను త్వరగా పూర్తి చేసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. బస్సు యాత్ర నిలిచిపోవడంతో నిర్మాతలు కూడా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో హరిహర వీరమల్లు చిత్రం చివరి దశలో ఉంది. ఆ తర్వాత హరీష్ శంకర్ తో భవదీయుడు భగత్ సింగ్, వినోదయా సీతం రీమేక్ సెట్స్ మీదకు రాబోతున్నాయి. అంతేకాకుండా సురేందర్ రెడ్డి సినిమా ఒకటి అనుకుంటున్నారు. బస్సు యాత్ర లేకుంటే ఈ సినిమాలన్నీ పూర్తయినట్లే.

Pawan Kalyan

ఇక తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ అర్జెంటుగా అమెరికా యాత్రకు సిద్ధం అవ్వాల్సి వచ్చింది. అక్కడ కొంతమంది ప్రముఖులను భేటీ కావాల్సి ఉందని దానికోసమే ఇంత అర్జెంటుగా పవన్ కళ్యాణ్ అమెరికాకు వెళ్లినట్లు తెలిసింది. మరో రెండు మూడు రోజుల వరకూ పవన్ అమెరికాలోనే ఉండవలసి వస్తుందని సమాచారం వినిపిస్తుంది. ఇంతకీ పవన్ అమెరికాకి వెళ్ళవలసిన కారణం సినిమాల పరంగానా.. రాజకీయపరంగానా  లేదా ఆర్థిక సంబంధిత విషయాలపై భేటీనా.. అనే విషయం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM