Hyper Aadi : సిరిపై పంచ్ లు.. హైపర్ ఆది ఎప్పటికీ బుద్ధి మార్చుకోడు అంటూ మండిపడుతున్న నెటిజ‌న్లు..

Hyper Aadi : ఇంకో నాలుగు రోజుల్లో దసరా సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి. దసరా నవరాత్రుల సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి బుల్లితెరపై ప్రతి ఛానల్ లోనూ అనేక కార్యక్రమాలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఇటీవల ఈటీవీలో ప్రసారం కాబోతున్న దసరా ప్రత్యేక ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆ ప్రోమోలో హైపర్ ఆది ఎప్పటి మాదిరిగానే తనదైన శైలిలో పంచ్ ల వర్షం కురిపిస్తూ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తున్నాడు.

అదే మాదిరిగా ఈ ప్రోమోలో ఎప్పుడూ చేసినట్లుగానే ఇతరులపై అవమానకరమైన వ్యాఖ్యలను చేస్తూ అవతలి వారిని ఇబ్బంది పెడతాడు హైపర్ ఆది. ఆ పంచ్ లు వేయబోతున్నట్లుగా ముందే హైపర్ ఆది వాళ్లకు చెబుతాడట. అయినా కూడా హైపర్ ఆది స్టేజ్ పర్ఫామెన్స్ చేస్తుండగా వారు ఆ సమయంలో ఇబ్బంది పడ్డట్లుగా అనిపిస్తుంది. ఎంతో మంది సీనియర్ లను అవమానకరంగా వ్యాఖ్యలు చేసే హైపర్ ఆది తాజాగా సిరి హనుమంతుపై తనదైన శైలిలో వ్యంగ్యంగా  కామెడీ పంచ్ లు వేశాడు.

Hyper Aadi

బిగ్ బాస్ హౌస్ లో ఒక షన్నూ కి మాత్రమే నువ్వు ఫన్ ఇచ్చావు కానీ ప్రేక్షకులకు ఇవ్వలేదు అన్నట్లుగా హైపర్ ఆది సిరిని కామెంట్ చేశాడు. ఆ సమయంలో సిరి కాస్త ఇబ్బంది పడ్డట్లుగా అనిపించింది. బిగ్ బాస్ లో ఉన్న సమయంలో సిరి మరియు షణ్ముఖ్ జస్వంత్ బాగా దగ్గరయ్యారు. వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నారు. కేవలం ఆ రిలేషన్ వల్లే షణ్ముఖ్ జస్వంత్ కి బిగ్ బాస్ ట్రోఫీ మిస్ అయ్యింది అనడంలో సందేహమే లేదు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరి గురించి ఏ విషయం బయటకు రాలేదు. కేవలం హౌస్ లో వారిద్దరు రేటింగ్‌ కోసమే అలా నటించారు అనేది చాలా మంది నమ్మకం.

గడిచిపోయిన కొన్ని చేదు సంఘటనలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోకుండా ఉంటేనే మంచిది. ఇప్పుడు సిరితో ఆ విషయం గురించి మాట్లాడితే ఆమె కచ్చితంగా ఫీల్ అవుతుంది. కానీ హైపర్ ఆది ఏమాత్రం మొహమాటం లేకుండా పిచ్చి కూతలు కూస్తూ ఇష్టానుసారంగా కామెడీ పేరుతో అవతలి వారిని విమర్శిస్తూనే ఉన్నాడు. ఆది ఇలా ఇతరులపై ఈవిధంగా వ్యాఖ్యలు చేస్తూ కామెడీ క్రియేట్ చేయడాన్ని చాలామంది తప్పు పడుతున్నారు. హైపర్ ఆది ఈ విషయాలేమీ పట్టించుకోకుండా తన దైన శైలిలో వ్యంగ్యంగా కామెడీని క్రియేట్ చేస్తూ షోకి వచ్చిన వారిని ఇబ్బంది పెడుతున్నాడు. ఆది కొత్త రకం కామెడీ.. ఎన్నాళ్ళు నవ్వు తెప్పిస్తుందో తెలియదు కానీ, చూసే ప్రేక్షకులకు మాత్రం చిరాకు తెప్పించడం మొదలైంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM