Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న పవన్ కల్యాణ్ తాజాగా భీమ్లా నాయక్ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తున్నారు. ఈ సినిమా విజయం సాధించడంతో మరో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తమిళంలో సముద్రఖని నటించి తానే దర్శకత్వం వహించిన వినోదాయసితం అనే సినిమాను తెలుగులో పవన్ హీరోగా రీమేక్ చేయబోతున్నారని గత కొద్ది రోజులుగా పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు తెలుగులో సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 రోజుల కాల్షీట్స్ ఇచ్చినట్లు సమాచారం.
ఇలా ఇరవై రోజుల పాటు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనడం కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ఇండస్ట్రీ టాక్. ఈ ప్రకారం చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఒక్క రోజుకే రూ.2.50 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు అర్థమవుతోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ క్రేజ్ మామూలుగా లేదనే చెప్పాలి. ఒక్క రోజుకే రూ.2.50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారంటే ఈయన స్టామినా ఏంటో అందరికీ అర్థమవుతుంది. ఇక ఈ సినిమాని ఉగాది పండుగ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారని తెలుస్తోంది.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…