Pawan Kalyan : వామ్మో.. పవన్ కల్యాణ్‌ క్రేజ్ మామూలుగా లేదుగా.. ఒక్కరోజుకే అన్ని కోట్ల రెమ్యూనరేషనా ?

March 5, 2022 6:22 PM

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న పవన్ కల్యాణ్ తాజాగా భీమ్లా నాయక్ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తున్నారు. ఈ సినిమా విజయం సాధించడంతో మరో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Pawan Kalyan reportedly taking huge remuneration for one day
Pawan Kalyan

తమిళంలో సముద్రఖని నటించి తానే దర్శకత్వం వహించిన వినోదాయసితం అనే సినిమాను తెలుగులో పవన్ హీరోగా రీమేక్ చేయబోతున్నారని గత కొద్ది రోజులుగా పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు తెలుగులో సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 రోజుల కాల్షీట్స్ ఇచ్చినట్లు సమాచారం.

ఇలా ఇరవై రోజుల పాటు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనడం కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని ఇండస్ట్రీ టాక్. ఈ ప్రకారం చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఒక్క రోజుకే  రూ.2.50 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు అర్థమవుతోంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ క్రేజ్ మామూలుగా లేదనే చెప్పాలి. ఒక్క రోజుకే రూ.2.50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారంటే ఈయన స్టామినా ఏంటో అందరికీ అర్థమవుతుంది. ఇక ఈ సినిమాని ఉగాది పండుగ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment