Pawan Kalyan : ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌.. ఆ విధంగా చేస్తార‌ట‌..!

Pawan Kalyan : రిప‌బ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక అనంత‌రం ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయాల ప‌రంగా స్పీడు పెంచారు. ఏపీలో వ‌రుస ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే ఆయన శ‌నివారం అనంత‌పురం జిల్లాలోని నాగుల‌క‌నుమలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన శ్ర‌మ‌దానంలో ఆయ‌న పాల్గొన్నారు.

రాయ‌ల‌సీమ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప‌వ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. 2024లో ఏపీలో జ‌న‌సేన అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. అప్పుడు రాయ‌ల‌సీమ‌లోనే సీఎం క్యాంప్ ఆఫీస్‌ను ఏర్పాటు చేస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాయ‌ల‌సీమ అభివృద్ధికి తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని తెలిపారు.

రాయలసీమలో ఉపాధి అవకాశాలు లేవ‌ని, దీంతో యువత వలస వెళ్లిపోవాల్సిన దుస్థితి నెల‌కొంద‌న్నారు. రాయ‌ల‌సీమ నుంచి ఎంతో మంది సీఎంలు వ‌చ్చార‌ని, కానీ ప‌రిశ్ర‌మ‌ల‌ను తేలేద‌ని విమ‌ర్శించారు. తాను సీఎంను అయితే రాయ‌ల‌సీమ‌కు ప‌రిశ్ర‌మ‌ల‌ను ర‌ప్పిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

తాను నెల్లూరు జిల్లాలో చదువుకున్నానని, రెడ్డి సామాజికవర్గంతో కలిసి పెరిగానని, రాయ‌ల‌సీమ క‌రువు సీమ‌గా మారింద‌ని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనదే అధికారమని అన్నారు. వైసీపీ పాలన బాగుంటే తాము రోడ్ల మీదకు వచ్చే అవసరం ఉండేది కాదన్నారు. రాయలసీమ పోరాటాల, పౌరుషాల గడ్డ అని, ప్రజా స్వామ్యం అనే ఆయుధాన్ని ప్రజలు వాడుకోవాలని పిలుపునిచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM

‘కిల్లర్’ మిల్లర్ ఇప్పుడు విలన్ అయ్యాడా? డీసీ ఓటమిపై సునీల్ గవాస్కర్ సంచలన విశ్లేషణ..

ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…

Thursday, 9 April 2026, 9:01 PM