Beetroot Juice : బీట్‌రూట్ తినడం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. కానీ ఇది అందించే ప్రయోజనాలు అమోఘం. అనేక పోషకాలు ఇందులో ఉంటాయి. కనుక రోజూ బీట్‌రూట్‌ను తీసుకోవాల్సిందే. అయితే బీట్‌రూట్‌ను తినలేని వారు దాన్ని జ్యూస్ తీసి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కు ముందు ఒక కప్పు మోతాదులో తీసుకోవాలి. దీంతో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
బీట్‌రూట్ జ్యూస్‌ను తాగడం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. మహిళలకు, గర్భిణీలకు, రక్తం తక్కువగా ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
బీట్‌రూట్ జ్యూస్‌ను తాగితే శక్తి లభిస్తుంది. ఉదయం తాగుతారు కనుక రోజంతా ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. ఎక్కువ పనిచేసినా అలసిపోరు. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి.
పొడి చర్మం ఉన్నవారు రోజూ బీట్‌రూట్ జ్యూస్‌ను తాగాలి. దీంతో చర్మం తేమగా మారుతుంది. మృదువుగా ఉంటుంది. వాపులు ఉన్నవారు ఈ జ్యూస్‌ను తాగితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
లివర్ సమస్యలు ఉన్నవారు రోజూ ఈ జ్యూస్‌ను తాగితే లివర్ శుభ్రంగా మారుతుంది. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు.
హైబీపీ ఉన్నవారికి బీట్‌రూట్ వరమనే చెప్పవచ్చు. ఈ జ్యూస్‌ను తాగితే బీపీ తగ్గుతుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా అడ్డుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు బీట్‌రూట్ జ్యూస్‌ను తాగితే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…