టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన ప‌విత్ర లోకేష్ వ్య‌వ‌హారం.. మ‌ళ్లీ ఏమైంది..?

August 5, 2022 8:40 PM

సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌, న‌టి ప‌విత్ర లోకేష్ ల వ్య‌వ‌హారం ఎంత‌టి చ‌ర్చ‌నీయాంశంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. వీరు ఒక హోట‌ల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ‌డంతో వీరిపై ఉన్న గౌర‌వం కాస్తా పోయింది. అయితే అనూహ్యంగా వీరు హైలైట్ అయ్యారు. ఈ మ‌ధ్యే విడుద‌లైన ప‌లు సినిమాల్లో వీరు క‌నిపించేసరికి ప్రేక్ష‌కులు విజిల్స్ వేస్తూ చ‌ప్ప‌ట్లు కొట్టారు. అయితే ప‌రువు పోయి అవ‌కాశాలు త‌గ్గుతాయ‌నుకున్న ప‌విత్ర‌కు ఇంత‌టి రెస్పాన్స్ వ‌చ్చేస‌రికి ఆమె త‌న పారితోషికాన్ని పెంచింద‌ని తెలుస్తోంది. దీంతో నిర్మాత‌లు హైరానా ప‌డుతున్నార‌ట‌.

అస‌లే క‌రోనా కార‌ణంగా టాలీవుడ్‌కు తీవ్ర‌మైన దెబ్బ ప‌డింది. దీనికి తోడు గోటి చుట్టుపై రోక‌లిపోటులా మ‌రోవైపు ఓటీటీల కార‌ణంగా థియేట‌ర్లకు వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింది. దీంతో సినిమా పాజిటివ్ టాక్‌ను ద‌క్కించుకున్నా రెండో రోజు నుంచే క‌లెక్ష‌న్లు దారుణంగా ప‌డిపోతున్నాయి. దీంతో నిర్మాత‌లు అంద‌రూ షూటింగ్‌ల‌ను నిలిపివేసి స‌మ‌స్య‌లు ప‌రిష్కరించుకోవాల‌ని చ‌ర్చిస్తున్నారు. అయితే ఖ‌ర్చులు త‌గ్గించుకోవ‌డం అన్న‌ది కూడా వారి స‌మ‌స్య‌ల్లో ఉంది. అందులో భాగంగానే న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్ ను త‌గ్గించాల‌ని వారు చూస్తున్నారు. ఇప్ప‌టికే హీరోల‌తో ఈ విష‌యం చ‌ర్చించి ఒక అంగీకారానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

pavitra lokesh remuneration increase headache for producers

అయితే ఈమ‌ధ్య త‌న‌కు ల‌భించిన ఆద‌ర‌ణ కార‌ణంగా ప‌విత్రా లోకేష్ త‌న రెమ్యున‌రేష‌న్‌ను పెంచింద‌ట‌. మొన్న‌టి వ‌ర‌కు రోజుకు రూ.60వేలు తీసుకున్న ఆమె ఇప్పుడు ఏకంగా రూ.1 ల‌క్ష వ‌ర‌కు డిమాండ్ చేస్తున్న‌ద‌ట‌. దీంతో అస‌లే న‌ష్టాల్లో ఉండి న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్‌ను త‌గ్గించాల‌ని చూస్తుంటే.. ఇప్పుడు ప‌విత్రా లోకేష్ ఇలా రెమ్యున‌రేష‌న్‌ను పెంచ‌డం ఏమీ బాగాలేద‌ని అంటున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్‌లో ఈమె వ్య‌వ‌హారం మ‌రోమారు చ‌ర్చ‌నీయాంశం అయిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఒక్క న‌టి కోసం నిర్మాత‌లు ఏమీ ఆలోచించ‌రు. అంద‌రికీ సౌక‌ర్యంగా ఉండేలా చేస్తారు. క‌నుక ఆమెను పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌చ్చ‌ని తెలుస్తోంది. ఇక టాలీవుడ్ స‌మ‌స్య‌ల‌కు ఎప్పుడు ప‌రిష్కారం ల‌భిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now