Marriage : ప్రేమ విఫ‌ల‌మైన యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌.. గుడి క‌ట్టి అత‌ని విగ్ర‌హానికి ఏటా వివాహం జ‌రిపిస్తున్న త‌ల్లిదండ్రులు..!

April 11, 2022 6:45 PM

Marriage : ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్ల‌లు త‌మ క‌ళ్ల ముందే చ‌నిపోతే ఆ త‌ల్లిదండ్రుల‌కు ఉండే వ్య‌థ అంతా ఇంతా కాదు. త‌మ‌కు వృద్ధాప్యంలో కొండంత అండ‌గా ఉంటార‌నుకునే పిల్ల‌లకు తామే త‌ల‌కొరివి పెట్టాల్సి రావ‌డం.. అంత‌క‌న్నా మించిన శోకం తల్లిదండ్రుల‌కు ఇంకొక‌టి ఉండ‌దు. ఆ త‌ల్లిదండ్రుల‌కు కూడా ఆ కొడుకు అలాంటి శోకాన్నే మిగిల్చాడు. అయితే కొడుకు పోయిన దుఃఖాన్ని మ‌రిచిపోలేని ఆ దంప‌తులు అత‌నికి ఏకంగా గుడి క‌ట్టి పూజిస్తున్నారు. ఈ సంఘ‌ట‌న మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..

parents doing Marriage to deceased son statue
Marriage

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాకు చెందిన భూక్యా లాలు, సుక్కమ్మ దంపతులకు రాంకోటి అనే కుమారుడితోపాటు ఓ కుమార్తె ఉంది. కాగా రాంకోటి అదే తండాకు చెందిన‌ ఓ యువతిని ప్రేమించాడు. త‌మ‌కు పెళ్లి చేయ‌మ‌ని త‌మ పెద్ద‌ల‌ను వారు అడిగారు. అయితే వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో మనస్థాపం చెందిన రాంకోటి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘ‌ట‌న‌తో అత‌ని త‌ల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు. వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అయితే ఈ సంఘ‌ట‌న జ‌రిగింది.. 2003లో.

ఆ త‌రువాత ఒక రోజు తల్లి సుక్కమ్మకు త‌న కుమారుడు రాంకోటి కలలో కనిపించాడు. ప్రతి శ్రీరామనవమి రోజు తనకు పెళ్లి చేయాలని కోరాడు. దీంతో ఆ దంపతులు తమ ఇంటి ఆవరణలోనే ఉన్న‌ ఖాళీ స్థలంలో త‌మ‌ కొడుక్కి గుడి కట్టారు. అందులో త‌మ కుమారుడు రాంకోటితోపాటు ఓ యువతి విగ్రహాన్ని వారు ఏర్పాటు చేశారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలా వారి విగ్ర‌హాల‌ను అలంక‌రించారు. అనంత‌రం ఆ తండా వాసుల స‌మ‌క్షంలో పెళ్లి చేశారు.

ఇలా ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజు త‌మ కుమారుడు కోరిన‌ట్లు వారు అత‌ని విగ్ర‌హానికి క‌ల్యాణం జ‌రిపిస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా శ్రీరామనవమి రోజున త‌మ‌ బంధుమిత్రులు, స్థానికుల సమక్షంలో మ‌రోమారు రాంకోటికి కళ్యాణం నిర్వహించారు. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now