Pakka Commercial Review : మారుతి దర్శకత్వంలో గోపీచంద్, రాశిఖన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ.. పక్కా కమర్షియల్. ఈ మూవీ నేడు (జూలై 1, 2022) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. సీటీ మార్ తరువాత గోపీచంద్ చేసిన మూవీ ఇది. గతంలో ఈయన నటించిన చిత్రాలకు భిన్నంగా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో గోపీచంద్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ మూవీ ఎలా ఉంది.. కథ ఏమిటి.. ఈ మూవీ ప్రేక్షకులను అలరించిందా.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కథ..
రామ్ చంద్ (గోపీ చంద్) ఒక లాయర్. పక్కా కమర్షియల్‌గా ఉంటాడు. ఆయన తండ్రి సత్యరాజ్ జడ్జి. నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి. ఎన్నో కేసులను వాదించి బాధితులకు న్యాయం చేసి తరువాత జడ్జి అవుతారు. అయితే తండ్రీ కొడుకులు ఇద్దరూ భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. రామ్ చంద్ పూర్తిగా కమర్షియల్ అయితే అతని తండ్రి మాత్రం మానవత్వం ఉన్న వ్యక్తి. ఈ క్రమంలో ఇద్దరికీ తరచూ గొడవలు వస్తుంటాయి. అయితే రామ్ చంద్ కొంత కాలం పాటు లాయర్ వృత్తిని మానేస్తాడు. మళ్లీ ఒక కేసు మిస్టరీని ఛేదించేందుకు లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెడతాడు. ఇక టీవీ సీరియల్స్‌లో నటించే ఝాన్సీ (రాశిఖన్నా) ఒక పాత్ర కోసం రామ్ చంద్ దగ్గర అసిస్టెంట్‌గా చేరి ట్రెయినింగ్ తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఆ మిస్టరీ కేసు ఏమవుతుంది ? తండ్రీ కొడుకులు ఈ కేసును ఏ విధంగా సాల్వ్ చేస్తారు ? ఝాన్సీ పాత్ర ఏమవుతుంది ? అన్న వివరాలను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
విశ్లేషణ..
ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే.. గోపీచంద్‌లో మునుపటి ఉత్సాహం, జోరు కనిపించాయి. ఆయన గతంలో చేసిన లౌక్యం సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా అలరించింది. సరిగ్గా అదే జోనర్‌లో వచ్చిన చిత్రం ఇది. కనుక ప్రేక్షకులు అనేక సీన్లను ఎంజాయ్ చేస్తారు. హీరోగా గోపీచంద్ ఈ సినిమాకు పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు. అలాగే రాశి ఖన్నా కూడా ఈ మూవీలో క్యూట్‌గా కనిపించింది. ఇక సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పాత్రకు కూడా న్యాయం చేశారు. అలాగే అనసూయ, రావు రమేష్, సప్తగిరి, వరలక్ష్మి శరత్ కుమార్ తదితర నటీనటులు తమ పాత్రల పరిధుల మేర బాగానే నటించారు.
ఈ మూవీకి దర్శకుడు మారుతి అన్నీ తానే అయి నడిపించారు. మారుతి మూవీ అంటే కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా. ఆయన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి. గతంలోనూ ఆయన ఇలాంటి జోనర్‌లలో సినిమాలు తీసి ఆకట్టుకున్నారు. ఆయన సినిమాలో చెప్పే కథను సూటిగా సుత్తి లేకుండా చెబుతారు. అంతేకాదు.. అందులో కామెడీ ప్రధానాంశంగా ఉంటుంది. ఇలా సినిమాలను తీయడంలో మారుతి దిట్ట అని చెప్పవచ్చు. ఇక సినిమాకు సంబంధించిన ఇతర అంశాలు కూడా బాగానే ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే ప్రేక్షకులకు పక్కా కమర్షియల్ మూవీ ఎంతో వినోదాన్ని అందిస్తుందని చెప్పవచ్చు. చాలా రోజుల తరువాత గోపీచంద్ మళ్లీ చక్కని ఎంటర్‌టైనర్‌తో అలరించారు. ఈ మూవీని ఫ్యామిలీతో ఒకసారి తప్పక చూడవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…