Over Weight : అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గాల‌నుకుంటున్నారా.. అయితే ఈ ఆయుర్వేద చిట్కాల‌ను పాటించండి..

November 14, 2022 8:34 PM

Over Weight : ప్రస్తుత తరుణంలో అనేక మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. మారుతున్న జీవనశైలి, కొత్త ఆహారపు అలవాట్లు వలన నూటికి 90 శాతం మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ అధిక బరువు సమస్యకు ఎక్స్ట్రా ఎనర్జీలాగా డయాబెటిస్, రక్త పోటు, మానసిక సమస్యల వంటి అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి.  ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడి ఆరోగ్యమైన జీవనశైలితో ఆనందంగా గడపాలంటే మొదటగా అధిక బరువు సమస్యను నియంత్రించుకోవాలి. ఆరోగ్యంగా బరువు తగ్గడం అనేది క్రమంగా జరిగే ప్రక్రియ. మీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా సులువుగా బరువు తగ్గవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. మరి ఎలాంటి నియమాలు పాటించడం ద్వారా మీ అధిక బరువును నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు ఇప్పుడు చూద్దాం.

రోజుకి మూడు నుంచి ఐదు లీటర్ల నీళ్ళు తాగాలి. భోజనానికి ఒక గంట ముందు నీళ్ళు తాగాలి. అలానే భోజనం చేసిన వెంటనే నీరు తాగడం మానేయాలి. గోరువెచ్చని నీటిని తాగితే మరీ మంచిది. మాంసాహారానికి వీలైనంత దూరంగానే ఉండాలి. ఆకుకూరలను అధికంగా తినాలి. పెరుగు బదులు పల్చటి మజ్జిగని  ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఇలా చేస్తే మలబద్దకం తగ్గి స్థూలకాయాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. పాలు, పెరుగు, నూనె పదార్థాలను తీసుకోవడం మానేయాలి. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి.చిక్కని పాలు బదులు టోన్డ్ మిల్క్ మాత్రమే తీసుకోవాలి. అన్నం, ఆలుగడ్డ, ఇతర దుంపకూరలను సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. చెక్కర, మైదా, ఇతర పిండి పదార్ధాలను పూర్తిగా మానేయాలి. బేకరీ ఫుడ్స్ జోలికి వెళ్ళరాదు. అతి నిద్ర, మధ్యాహ్నం భోజనం చేసాక నిద్ర పోవడం మానేయటం ఉత్తమం. ఎయిరేటెడ్ డ్రింక్స్, ఆల్కాహాల్ కు, కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి.

Over Weight can be reduced by following these ayurvedic tips
Over Weight

గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె, ఒకస్పూన్ నిమ్మరసం కలుపుకొని తాగాలి.. ఇలా ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవచ్చు. డైట్ లో వెజిటేబుల్ సలాడ్స్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా గోధుమ రొట్టెలు తినడం వలన బరువు పెరగకుండా, పొట్టరాకుండా ఉంటుంది. ఇక అన్నిటికంటే  అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అది వ్యాయామం. పెద్ద పెద్ద వ్యాయమాలు చేయలేనివారికి నడక ఉత్తమం. అలానే కుదిరితే రన్నింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఇతర ఏదైనా గేమ్స్ లో పాల్గొనవచ్చు. ఇలా మీ రోజువారి జీవితంలో చిన్నపాటి మార్పులు చేస్తే చాలు మీ అధిక బరువు నియంత్రణలోకి వచ్చి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now