OTT Movies : సినీ ప్రేక్ష‌కుల‌కు ఈ వారం పండ‌గే.. ఓటీటీల్లో విడుద‌ల కానున్న మూవీలు ఇవే..!

November 23, 2021 4:56 PM

OTT Movies : వారాంతాల్లో థియేట‌ర్ల‌లో సినిమాలు విడుద‌ల అవడం స‌హ‌జ‌మే. అయితే ఇప్పుడు ఓటీటీల హ‌వా న‌డుస్తోంది. దీంతో చాలా మంది ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వెళ్ల‌కుండా ఓటీటీల్లోనే సినిమాల‌ను చూస్తున్నారు. ఎలాగూ సినిమా విడుద‌ల‌య్యాక నెల రోజుల త‌రువాత ఓటీటీలో వ‌స్తుంది క‌దా.. అని కొంద‌రు థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం లేదు. ఇక కొన్ని సినిమాలు అయితే నేరుగా ఓటీటీల్లోనే విడుద‌ల‌వుతున్నాయి. దీంతో ప్రేక్ష‌కులు ఓటీటీల‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు. ఇక ఈ వారం ఓటీటీల్లో ప‌లు ప్ర‌ముఖ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దామా..!

OTT Movies these movies will release on otts this week

వెంక‌టేష్‌, మీనా న‌టించిన దృశ్యం 2 మూవీ ఈ నెల 25వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. అలాగే ఆకాష్ పూరీ న‌టించిన రొమాంటిక్ మూవీ ఆహాలో స్ట్రీమ్ కానుంది. ఈ మూవీ న‌వంబ‌ర్ 26 నుంచి స్ట్రీమ్ అవుతుంది.

ఇక సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన రిప‌బ్లిక్ మూవీ జీ5 యాప్‌లో స్ట్రీమ్ అవుతుంది. దీన్ని న‌వంబ‌ర్ 26 నుంచి స్ట్రీమ్ చేస్తారు. న‌వీన్ చంద్ర‌, అవికా గోర్ న‌టించిన బ్రొ అనే మూవీని సోనీ లివ్‌లో ఈ నెల 26 నుంచి స్ట్రీమ్ చేయ‌నున్నారు. దీంతో ప్రేక్ష‌కుల‌కు చ‌క్క‌ని వినోదం ల‌భించ‌నుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now