Online Delivery : ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేస్తే ఫోన్‌కు బ‌దులుగా స‌బ్బు వ‌చ్చింది.. రీఫండ్ ఇవ్వ‌క‌పోతే పోరాడి విజ‌యం సాధించింది..!

October 4, 2021 2:16 PM

Online Delivery : ప్ర‌స్తుతం చాలా మంది ఆన్‌లైన్‌లో అనేక ర‌కాల వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తున్నారు. ఆన్‌లైన్ లో ఏది ఆర్డ‌ర్ చేసినా అది నేరుగా మ‌న ఇంటికే వ‌స్తోంది. దీంతో షాపింగ్ చేయ‌డం త‌గ్గించారు. ఎక్క‌డి నుంచైనా, ఎప్పుడైనా ఆర్డ‌ర్ చేసే వీలు ఉండ‌డంతో ప్ర‌తి చిన్న వ‌స్తువును చాలా మంది ఆన్‌లైన్ లోనే ఆర్డ‌ర్ ఇస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌లో మ‌నం ఇచ్చే ఆర్డ‌ర్‌కు బ‌దులుగా ఏ స‌బ్బు బిళ్ల‌నో, రాళ్లో వస్తే.. ఏం చేయాలి ? అంటే..

Online Delivery : ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేస్తే ఫోన్‌కు బ‌దులుగా స‌బ్బు వ‌చ్చింది.. రీఫండ్ ఇవ్వ‌క‌పోతే పోరాడి విజ‌యం సాధించింది..!

పంజాబ్‌కు చెందిన డోరా డెబి అనే యువ‌తి అమెజాన్‌లో రూ.16,800 కు ఒక ఫోన్‌ను ఆర్డ‌ర్ చేసింది. అయితే ఆర్డ‌ర్ వ‌చ్చింది కానీ అందులో ఫోన్ లేదు. స‌బ్బు ఉంది. దీంతో ఖంగు తిన్న ఆమె వెంట‌నే క‌స్ట‌మ‌ర్ కేర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు ఇచ్చింది.

అయితే వారు విచార‌ణ చేశారు. కానీ త‌మ త‌ప్పేమీ లేద‌ని చెప్పారు. రీఫండ్ ఇవ్వ‌డం కూడా కుద‌ర‌ద‌న్నారు. దీంతో ఆమె వినియోగ‌దారుల ఫోరంలో కేసు వేసింది. ఫ‌లితంగా ఫోరం ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఆ మొత్తాన్ని రీఫండ్ చేసేందుకు అమెజాన్ అంగీక‌రించింది.

అయితే ఈ విధంగా ఎవ‌రికైనా జ‌ర‌గ‌వ‌చ్చు. క‌నుక ఎవ‌రైనా స‌రే ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేశాక వ‌స్తువు చేతికి వ‌స్తే వెంట‌నే దాన్ని సీల్ తీయ‌రాదు. జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాలి. సీల్ ఏమాత్రం చిరిగిపోయిన‌ట్లు అనుమానం వ‌చ్చినా అక్క‌డే ఆ వ‌స్తువును ఏ మొహ‌మాటం లేకుండా ఇచ్చేయాలి. దీంతో మోస‌పోయే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now