అవకాశాలు ఇప్పిస్తానంటూ మోసాలు చేస్తున్న హీరో..!

November 12, 2021 3:28 PM

కన్నడ బుల్లితెర నటి, శాండిల్ వుడ్ బుల్లితెర హీరోపై సంచలన ఆరోపణలు చేశారు. వీరిద్దరూ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో పరిచయం అయ్యారని, తనకు హీరోయిన్ గా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించారని, దాంతో తనపై అత్యాచారం చేసినట్లుగా పేర్కొన్నారు. ఆ ఘటన తర్వాత చాలాసార్లు ఆమె ఇంటికి వచ్చి తనపై బలవంతంగా అఘాయిత్యం చేసినట్లు తెలిపారు. అలా పెళ్ళికి ముందు చాలాసార్లు ఆమెను బలవంతం చేసినట్లు తెలిపింది.

one hero cheating actress offering her movie chances

పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చి.. ఆ తర్వాత ఎన్నో సార్లు పెళ్ళి గురించి అడిగితే తప్పించుకునేవారు. ఆమె స్నేహితులు, బంధువులు ఆ హీరోని ఒత్తిడి చేయడంతో ఓ గుడిలో పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నారట. ఆ తర్వాత కూడా ఆమె భర్త, అత్తింటివాళ్ళు, బంధువులు విపరీతంగా హింసించి టార్చర్ చేశారని తెలిపింది. కట్నం తేవాలని ఒత్తిడి చేస్తూ.. ఆమె కులం గురించి తక్కువ చేసి మాట్లాడేవారట.

ఇక ఆమె ఈ వేధింపులను భరించలేక బసవనగుడి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. పోలీస్ కంప్లైంట్ తో ఆమె తన భర్త, అత్తమామలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. రీసెంట్ గా ఈ నటి ఓ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసింది. అయితే ప్రస్తుతం ఈమె భర్త సీరియల్స్ లో హీరోగా నటిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now