షారూఖ్ త‌న‌యుడి ఫోన్ లో అశ్లీల‌ వీడియోలు.. షాకైన‌ ఎన్సీబీ అధికారులు

October 6, 2021 9:42 PM

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ రీసెంట్ గా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అన్ని ఆధారాలతో అరెస్ట్ అయినట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అరెస్ట్ అయిన టైమ్ లో ఆర్యన్ కు సంబంధించిన వస్తువుల్ని హ్యాండోవర్ చేసుకున్నారు. వాటిల్లో ఆర్యన్ ఫోన్ కూడా ఉంది. ఈ ఫోన్ లో డ్రగ్ డీలర్ తో ఏమైనా సంబంధాలున్నాయా అనే నేపథ్యంలో సెర్చ్ చేశారు.

objectionable videos found in aryan khan phone

ఆర్యన్ ఖాన్ తో పాటు మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు. ఆర్యన్ ఖాన్ ను షారుఖ్ ఖాన్ స్పెషల్ రిక్వెస్ట్ తో లాకప్ లో కలిశారు. తన తండ్రిని చూడగానే కన్నీటి పర్యంతమయ్యాడు. ఆర్యన్ తో షారుఖ్ ఖాన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. అయితే షారుఖ్ ని తన ఇంట్లో కలిసేలా పర్మిషన్ ఇవ్వాలని ఆర్యన్ కోరాడు. దానికి అధికారులు ఒప్పుకోలేదు.

ఇక ఆర్యన్ ఖాన్ ఖాన్ మొబైల్ ఫోన్ ను చూడగా అందులో అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు దొరికాయి. కొంతమంది సెలెబ్రెటీస్ తో కూడా షాకింగ్ వీడియోస్ ఆర్యన్ ఫోన్ లో కనిపించాయి. దీంతో ఎన్సీబీ అధికారులు షాక్ అయ్యారు. దీంతో ఆర్యన్ ఖాన్ పై ఈ డ్రగ్స్ కేసు మరింత స్ట్రాంగ్ అవుతుందని అధికారులు తెలిపారు. డ్రగ్స్ మాఫియాతో డీలింగ్స్ పై విచారణ ఇంకా జరుగుతుందని, మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తామని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now