NTR : చావు బ‌తుకుల మ‌ధ్య ఉన్న అభిమానికి.. కొండంత ధైర్యం అందించిన ఎన్టీఆర్

NTR : నంద‌మూరి తార‌క‌రామారావు న‌ట వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకొని టాలీవుడ్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతు సహాయాన్ని అందిస్తుంటాడు. నటనలోనూ.. దాతృత్వంలోనూ.. తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డు అనిపించుకున్నాడు ఎన్టీఆర్. ఏ అభిమానికి ఆప‌ద వ‌చ్చినా కూడా వెంట‌నే రియాక్ట్ అవుతుంటారు ఎన్టీఆర్. గతంలో ఎన్నోసార్లు తన అభిమానుల కోరికలను తీరుస్తూ.. వారికి సర్ ప్రైజ్ ఇచ్చాడు.

తాజాగా ఎన్‌టీఆర్‌.. చావు బతుకుల మధ్య ఉన్న ఓ అభిమాని కోరిక తీర్చాడు. తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలుకు చెందిన కొప్పాడి మురళీ ఎన్‌టీఆర్‌ వీరాభిమాని. ఇటీవల కొప్పడి మురళీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై రెండు కిడ్నీలు పాడైపోయి ఇవాళో, రేపో అనే ప‌రిస్థితిలో ఉన్నాడు. ఈ క్ర‌మంలో అతను తనకు జూనియర్ ఎన్టీఆర్ ను చూడాలని ఉందని.. డాక్టర్‏కు పేపర్ రాసి ఇచ్చాడు.

ముర‌ళీ కోరిక తెలుసుకున్న కుటుంబ స‌భ్యులు ఎన్టీఆర్‌కి ఈ విష‌యం చేర‌వేశారు. వెంట‌నే తన వీరాభిమానికి వీడియో కాల్ చేసి మాట్లాడారు. అనంతరం డాక్టర్లు, కుటుంబసభ్యులను పలకరించి.. నేను ఉన్నాను.. త్వరలో మనం కలుద్దామని ధైర్యం చెప్పారు ఎన్టీఆర్. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కూడా ఆకాంక్షించారు.

ఆ మ‌ధ్య ప్ర‌భాస్ అభిమాని కూడా ఆయ‌న‌తో మాట్లాడాల‌ని ఉంద‌ని తెలియ‌జేయ‌గా, డాక్ట‌ర్స్ యంగ్ రెబల్‌స్టార్ కు వీడియో కాల్ చేసి మాట్లాడారు. తనతో ప్రభాస్ మాట్లాడినందుకు ఆ అమ్మాయి ఎంతగా సంతోషపడిందో అలాంటి స్థితుల్లో ఆ అమ్మాయిని చూసినందుకు మాత్రం చాలా బాధపడ్డాడని ప్ర‌భాస్  అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM