NTR : ఎన్‌టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీ ఫొటో వైర‌ల్‌.. న‌కిలీ అంటున్న నెటిజ‌న్లు..

April 30, 2022 8:18 PM

NTR : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఈ మూవీతో ఎన్‌టీఆర్ పాన్ ఇండియా స్థాయి హీరో అయ్యాడు. ఇక ప్ర‌స్తుతం హ‌నుమాన్ దీక్ష‌లో ఉన్న ఎన్‌టీఆర్ దీక్షను ముగించుకుని త్వ‌ర‌లోనే త‌న 30వ సినిమా షూటింగ్‌లో పాల్గొన‌నున్నారు. అయితే ఎన్‌టీఆర్‌కు చెందిన ఓ ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అందులో ఎన్‌టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తుండ‌డం విశేషం. ఈ క్ర‌మంలోనే ఈ ఫొటో చూసి ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు.

NTR six pack body photo viral netizen call it fake or edited
NTR

ఎన్‌టీఆర్‌కు చెందిన ఈ సిక్స్ ప్యాక్ బాడీ ఫొటోను ప్ర‌ముఖ సెల‌బ్రిటీ ఫొటోగ్రాఫ‌ర్ డ‌బూ ర‌త్నాని షూట్ చేశారు. త‌న ఇన్‌స్టా ఖాతాలో ఈ ఫొటోను షేర్ చేశారు. దీంతో ఈ ఫొటో వైర‌ల్‌గా మారింది. అయితే ఈ ఫొటో ప‌ట్ల నెటిజన్లు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. కొంద‌రు ఏమంటున్నారంటే.. ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఎన్‌టీఆర్ కాస్త లావుగా అయ్యార‌ని.. కానీ ఈ ఫొటోలో చాలా స‌న్న‌గా ఉన్నాడ‌ని.. క‌నుక ఇంత త‌క్కువ స‌మ‌యంలో ఆయన ఇలా అయి ఉండ‌డ‌ని.. క‌చ్చితంగా ఫొటోను ఫొటోషాప్ చేసి ఉంటార‌ని అంటున్నారు.

అయితే ఇందుకు కొంద‌రు నెటిజ‌న్లు కౌంట‌ర్ కూడా ఇస్తున్నారు. అది పాత ఫొటో అయి ఉండ‌వ‌చ్చ‌ని.. అప్ప‌ట్లో.. అంటే.. త్రివిక్ర‌మ్‌తో క‌లిసి ఎన్‌టీఆర్‌.. అర‌వింద స‌మేత మూవీ చేసిన‌ప్పుడు ఇలాగే ఉన్నాడ‌ని.. ఆ మూవీలో ఆయ‌న సిక్స్ ప్యాక్ బాడీతో క‌నిపించార‌ని.. క‌నుక అప్ప‌టి ఫొటోనే ఇప్పుడు త్రో బ్యాక్ పిక్‌గా పోస్ట్ చేసి ఉంటార‌ని.. నిజా నిజాలు తెలుసుకుని మాట్లాడాల‌ని.. అంటున్నారు. ఏది ఏమైనా ఈ ఫొటో మాత్రం నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.

ఇక ఎన్‌టీఆర్ 30వ సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీ స్క్రిప్ట్ ను ఇప్ప‌టికే సిద్ధం చేసిన‌ట్లు తెలిపారు. ఈ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్ క‌మ‌ర్షియ‌ల్‌, మాస్ అంశాలు ఉంటాయ‌ని.. త‌న మిర్చి సినిమా క‌న్నా మాస్ సీన్లు ఇందులో కొన్ని రెట్లు ఎక్కువ‌గానే ఉంటాయ‌ని చెప్పారు. దీంతో ఈ మూవీ ప‌క్కా మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ అని తెలుస్తోంది. ఇక ఇందులో ఎన్‌టీఆర్ ప‌క్కన న‌టించేందుకు మొద‌ట ఆలియాభ‌ట్ ఓకే చెప్పినా త‌రువాత ఆమె తప్పుకుంద‌ని స‌మాచారం. దీంతో ఆమె స్థానంలో ర‌ష్మిక మంద‌న్నను ఎంపిక చేయాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ntr

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now