NTR : నంద‌మూరి – మెగా ఫ్యామిలీల మ‌ధ్య వైరం 35 ఏళ్ల నాటిది అన్న ఎన్టీఆర్..!

December 26, 2021 5:18 PM

NTR : సినిమా ఇండ‌స్ట్రీలో హీరోల మ‌ధ్య ఎప్పుడూ మంచి స్నేహా బంధాలు ఉంటూ వ‌స్తున్నాయి. కానీ అభిమానులే చిన్న విషయాల‌ని పెద్ద‌గా చేస్తూ గొడ‌వ‌ల‌కు దిగుతున్నారు. అయితే దశాబ్దాలుగా నందమూరి, మెగా ఫ్యామిలీల మధ్య ఉన్న పోరు గురించి ఓపెన్ అయ్యారు ఎన్టీఆర్. మా రెండు కుటుంబాల మధ్య 35 ఏళ్లుగా వైరం నడుస్తుందని అన్నారు. అయితే రామ్ చరణ్ నేను మంచి స్నేహితులం. మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.

NTR said mega and nandamuri enmity is 35 years old

సీనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాల్లో నెగెటివ్ రోల్స్ తోపాటు ప్రాధాన్యం ఉన్న పాత్రలను చిరంజీవి చేశారు. ఎన్టీఆర్ వెండితెర శకం ముగిశాక బాలయ్య ఫార్మ్ లోకి వచ్చారు. నందమూరి అభిమానుల అండతో ఆయన స్టార్ హోదా దక్కించుకున్నారు. అప్పటి నుండి చిరంజీవి-బాలయ్య ఫ్యాన్స్ మధ్య పోరు నడుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

చిరంజీవి – బాల‌కృష్ణ మ‌ధ్య కూడా మంచి స్నేహా భావం ఉన్న విష‌యం తెలిసిందే. కాగా జనవరి 7న ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఎన్టీఆర్ కొమురం భీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లు చేశారు. డీవీవీ దానయ్య దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కీరవాణి ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంగీతం సమకూర్చారు. అలియా భట్, అజయ్ దేవ్ గన్‌ కీలక రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now