NTR : కొర‌టాల‌కు స‌హాయం చేసేందుకు ఫిక్స్ అయిన ఎన్టీఆర్‌..? కానీ..?

July 20, 2022 9:48 AM

NTR : గొప్ప ద‌ర్శ‌కుడిగా పేరున్న కొర‌టాల‌ను ప్ర‌స్తుతం ఆర్థిక స‌మ‌స్య‌లు చుట్టుముట్టాయి. ఆచార్య మూవీ బిజినెస్ వ్య‌వ‌హారాల్లో అన‌వ‌స‌రంగా ఆయ‌న వేలు పెట్టారు. దీంతో ఆయ‌న ఇప్పుడు న‌ష్టాల‌ను భ‌రించ‌క త‌ప్ప‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న గురించి రోజుకో కొత్త వార్త బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఆచార్య న‌ష్టాల‌ను భ‌ర్తీ చేసేందుకు ఆయ‌న హైద‌రాబాద్ లోని ప్రైమ్ ఏరియాలో ఉన్న త‌న ఫ్లాట్‌ను విక్ర‌యిస్తున్నార‌ని అన్నారు. కానీ అలాంటిదేమీ లేద‌ని ఆయన పీఆర్ టీమ్ ఖండించింది. ఇక తాజాగా మ‌రో లేటెస్ట్ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. కొరటాల‌కు ఎన్టీఆర్ స‌హాయం చేసేందుకు ఫిక్స్ అయిన‌ట్లు స‌మాచారం. అయితే అది ఆర్థికంగా కాదు.. స్క్రిప్ట్ ప‌రంగా. ఈ క్ర‌మంలోనే ఈ వార్త సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

కొర‌టాల శివ ఎన్‌టీఆర్ 30వ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సినిమా షూటింగ్ ఇప్ప‌టికే ప్రారంభం కావ‌ల్సి ఉంది. కానీ ఇంకా స్క్రిప్ట్ ప‌నే పూర్తి కాలేద‌ట‌. అదే జ‌రిగితే సినిమా ప్రారంభానికి ఇంకా ఆల‌స్యం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. మ‌రోవైపు కొర‌టాల మూవీని త్వ‌ర‌గా పూర్తి చేసి కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా చేయాల‌ని అనుకుంటున్నారు. అప్ప‌టి వ‌ర‌కు డేట్స్ కుద‌ర‌క‌పోతే ప్ర‌శాంత్ నీల్ ఇంకో ప్రాజెక్టుకు వెళ్లిపోవ‌డం ఖాయం. అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే ఎన్‌టీఆర్ 30ని వీలైనంత త్వ‌ర‌గా ప్రారంభించాలి. కానీ కొర‌టాల తాను చేయాల్సిన ప‌నిలో తీవ్ర‌మైన జాప్యం చేస్తున్నార‌ట‌. ఆచార్య న‌ష్టాల భ‌ర్తీతో ఆర్థిక స‌మ‌స్య‌ల్లో ఉన్న కొర‌టాల ప్ర‌స్తుతానికి ఎన్టీఆర్ 30 స్క్రిప్ట్ ప‌నిని పూర్తి చేయ‌లేక‌పోతున్నార‌ని తెలుస్తోంది. క‌నుక‌నే ఈ విష‌యంలో స్వ‌యంగా ఎన్‌టీఆర్ రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది.

NTR reportedly decided to help Koratala Siva
NTR

ఒక మంచి ర‌చ‌యిత‌ను పెట్టుకుని త‌న 30 సినిమా స్క్రిప్ట్ ప‌ని పూర్తి చేయాల‌ని ఎన్‌టీఆర్ ఫిక్స్ అయ్యార‌ట‌. ఇలా ఆయ‌న కొర‌టాల శివ‌కు స‌హాయం చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. క‌నీసం స్క్రిప్ట్ ప‌ని అయినా పూర్తి అయితే షూటింగ్ ఎలాగో ప్లాన్ చేయ‌వ‌చ్చు. కాబ‌ట్టే ఇంకో ర‌చయిత‌కు ఆ ప‌ని అప్ప‌గించ‌నున్నార‌ని తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేదు. త్వ‌ర‌లో ఏమైనా వివ‌రాల‌ను వెల్ల‌డిస్తారేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now