NTR : షాకింగ్‌: ఎన్టీఆర్ చేతికి గాయ‌మైందా.. స‌ర్జ‌రీ కూడా చేయించుకున్నాడ‌ట‌..!

November 5, 2021 8:32 PM

NTR : ఈ మ‌ధ్య మ‌న హీరోలు ఆసుప‌త్రుల చుట్టూ తిరుగుతుండ‌డం అభిమానుల‌లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. సాయిధ‌ర‌మ్ తేజ్ నుండి మొద‌లు పెడితే అడివి శేష్‌, రామ్, చిరంజీవి, బాల‌కృష్ణ వంటి వారు ప‌లు కార‌ణాల‌తో ఆసుప‌త్రిలో చికిత్స పొందారు. తాజాగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జిమ్‌లో గాయ‌ప‌డ్డ‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. మూడు, నాలుగు రోజుల క్రితం జిమ్‌లో ఎన్టీఆర్ కుడి చేతి వేలికి గాయం అయింద‌ట‌.

NTR  might be injured we can see his bandage

వెంట‌నే ఆయన చేతికి చిన్న‌పాటి స‌ర్జ‌రీ చేయ‌గా, కొద్ది రోజులు ఇంట్లో ఉండ‌మ‌ని వైద్యులు సూచ‌న‌లు కూడా చేశార‌ట‌. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ క్షేమంగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీపావ‌ళి సంద‌ర్భంగా త‌న త‌న‌యులతో క‌లిసి దిగిన ఫొటోని ఎన్టీఆర్ షేర్ చేయ‌గా, ఇందులో ఎన్టీఆర్ కుడి చేతి వేలికి క‌ట్టు ఉండ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అయితే ఇదేమి అంత మేజ‌ర్ గాయం కాద‌ని స‌న్నిహితులు అంటున్నారు.

ఎన్టీఆర్ కొద్ది రోజులుగా ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాంతో బిజీగా ఉన్నారు. ఈ షో చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. త్వరలోనే ఆయన కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చే ఓ సినిమాలో నటించనున్నారు. దీంతోపాటు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో మరో సినిమాకు సంతకం చేశారు. ఈ సినిమాలు పాన్ ఇండియా చిత్రాలుగా రూపొంద‌నున్నాయ‌ని స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now