NTR : జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి వెనుక ఇంత కథ నడిచిందా.. పెళ్లి పెద్ద అతనేనా ?

November 10, 2021 2:02 PM

NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి  ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుని ఆ తర్వాత హీరోగా పరిచయమై ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటించే స్థాయికి ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తారక్ పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తారక్ సినీ జీవితం ఎంతో అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.

NTR  marriage real story who is behind it

తారక్ వ్యక్తిగత విషయానికివస్తే 2011వ సంవత్సరంలో తారక్.. లక్ష్మీప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కొడుకులు. వీరి వైవాహిక జీవితం కూడా ఎంతో హ్యాపీగా సాగిపోతోంది. అయితే ఎన్టీఆర్ పెళ్లి వెనుక చాలా పెద్ద కథ నడిచిందని తెర వెనుక ఓ వ్యక్తి కీలక పాత్ర పోషిస్తూ వీరి పెళ్లి జరిపించారనే విషయం ఎవరికీ తెలియదు. ఎన్టీఆర్ కు పెళ్లి చేయడం కోసం హరికృష్ణ సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో ఎంతో మంది అతనికి ఎన్నారై సంబంధాలు తీసుకువచ్చారు.

కానీ తారక్ బయట వ్యక్తులను కాకుండా తమ కుటుంబలో వారిని వివాహం చేసుకోవాలని హరికృష్ణ బావ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయానా తన కోడలు కూతురిని ఎన్టీఆర్ కి ఇచ్చి పెళ్లి చేసేలా తెరవెనుక ఉండి చర్చలు జరిపారు. ఇలా ఎన్టీఆర్ పెళ్లి జరిగిపోయింది. కాగా ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు స్టూడియో ఎన్ చానల్ నడిపించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now