NTR : వామ్మో.. భారీగా పెరిగిన ఎన్‌టీఆర్ రెమ్యున‌రేష‌న్‌.. ఆర్ఆర్ఆర్ ప్ర‌భావ‌మే..?

April 16, 2022 9:32 AM

NTR : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఇందులో కొమురం భీమ్‌గా ఎన్‌టీఆర్ యాక్టింగ్ అద‌ర‌గొట్టేశాడు. అలాగే అల్లూరి పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ అద్భుతంగా న‌టించి ఆక‌ట్టుకున్నాడు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతూ రికార్డుల‌ను కొల్ల‌గొడుతోంది. ఇక త్వ‌ర‌లోనే ఈ మూవీని చైనా, జ‌పాన్‌ల‌లోనూ విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ త‌రువాత చ‌ర‌ణ్‌, ఎన్‌టీఆర్‌లు త‌మ ప్రాజెక్టుల్లో బిజీగా మారిపోయారు.

NTR increased remuneration because of RRR movie success
NTR

రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన ఆచార్య సినిమా ఈ నెల 29వ తేదీన విడుద‌ల కానుండ‌గా.. శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో చ‌ర‌ణ్ ఇంకో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక ఎన్‌టీఆర్ కూడా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నారు. ఇందులో హీరోయిన్‌గా ఆలియాభ‌ట్‌ను క‌న్‌ఫామ్ చేశారు. కానీ ఆమెకు ప్ర‌స్తుతం వివాహం అయినందున ఆమె కాల్ షీట్స్ అందుబాటులో లేవు. దీంతో ఆమె ఈ సినిమా నుంచి త‌ప్పుకుంది. దీనిపై చిత్ర యూనిట్ తాజాగా ప్ర‌క‌టన చేసింది. ఆలియా న‌టించ‌డం లేద‌ని చెప్పారు. అయితే కొరటాల శివ‌తో చేయనున్న మూవీకి గాను ఎన్‌టీఆర్ భారీ ఎత్తున పారితోషికం తీసుకోబోతున్నాడ‌ని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమాకు డీవీవీ దాన‌య్య నిర్మాత కాగా.. ఆ మూవీకి తార‌క్ రూ.45 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడ‌ట‌. ఇక కొర‌టాల శివ‌తో చేయ‌నున్న సినిమాకు ఎన్‌టీఆర్ ఏకంగా రూ.10 కోట్లు పెంచి రూ.55 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్ వ‌ల్లే ఎన్‌టీఆర్ త‌న పారితోషికాన్ని అమాంతం పెంచేశార‌ని స‌మాచారం. ఇక త్వ‌ర‌లోనే ఈ సినిమా షూటింగ్‌ను జ‌రుపుకోనుంది. ఆలియా త‌ప్పుకోవ‌డంతో ఇంకో హీరోయిన్ కోసం ప్ర‌స్తుతం చిత్ర యూనిట్ వేట కొన‌సాగిస్తోంది.

ntr

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now