NTR : సుకుమార్ కు ఎన్టీఆర్ గట్టి వార్నింగ్.. ఎందుకు ఇచ్చాడో తెలుసా?

NTR : సినీ ఇండస్ట్రీలో సినిమాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నప్పుడు వివాదాలు, గొడవలు సహజం. ఈ గొడవలు చిన్నగానూ ఉండొచ్చు, పెద్దగానూ ఉండొచ్చు. ఈ క్రమంలో నటీనటులు, డైరెక్టర్లు, నిర్మాతలు గొడవలను తేలికగా తీసుకునేవారున్నారు. పెద్ద పెద్ద వివాదాలకు గురైన వారున్నారు. ఈ క్రమంలో గొడవ జరిగిన కాంబినేషన్ లో ఇక సినిమాలు కూడా రిపీట్ అవ్వకపోవచ్చు. అలాంటి ఓ వివాదమే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన సుకుమార్ కి, ఎన్టీఆర్ కి మధ్య జరిగింది.

2016 సుకుమార్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా సందర్భంలో ఎన్టీఆర్.. సుకుమార్ కి వార్నింగ్ ఇచ్చారట. మరి వార్నింగ్ ఇవ్వాల్సినంత మిస్టేక్ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. నాన్నకు ప్రేమతో సినిమా చేస్తున్నప్పుడు డైరెక్టర్ సుకుమార్ కు, ఎన్టీఆర్ కు మధ్య ఓ చిన్న గొడవ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ మరో సినిమాకి డేట్స్ ఇవ్వలేదు. అయితే సుకుమార్ మాత్రం నాన్నకు ప్రేమతో సినిమా చేస్తూనే మరో సినిమా షూటింగ్ ని షురూ చేశారట. అలా ఎన్టీఆర్ నటిస్తున్న నాన్నకు ప్రేమతో సినిమాకు బ్రేక్ ఇద్దామని సుక్కు అనుకున్నారు.

ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ ఇప్పుడు సినిమా తీస్తేనే నేను యాక్ట్ చేస్తాను. లేదంటే మొత్తానికి సినిమా చేయడం ఆగిపోతాను అని సుకుమార్ కు వార్నింగ్ ఇచ్చారట. దీంతో మరో సినిమా షూటింగ్ ని ఆపుకుని ఎన్టీఆర్ సినిమాని పూర్తిచేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. ప్రజంట్ సుకుమార్.. అల్లు అర్జున్ తో పుష్ప సినిమాతో ఫుల్ బిజీ అయ్యారు. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 17న రిలీజ్ అవుతోంది. అలాగే ఎన్టీఆర్.. రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

2024 vs 2026.. ఏ వరల్డ్ కప్ విజయం గొప్పది? ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర చర్చ!

భార‌త టీ20ఐ క్రికెట్ జ‌ట్టు టీ20 వ‌ర‌ల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ…

Saturday, 14 March 2026, 8:31 PM

గ్యాస్, పెట్రోల్ కొరత రాదు.. కేంద్రం కీలక ప్రకటన! ఆ జలసంధి వద్ద టెన్షన్..

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…

Saturday, 14 March 2026, 7:22 PM

అల్లు అర్జున్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభం.. ‘వాల్ ఆఫ్ గ్రేట్స్’పై మొదలైన వివాదం!

హైదరాబాద్‌లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్‌గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…

Saturday, 14 March 2026, 5:49 PM

‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఖరారు.. రష్మిక-షాహిద్-కృతి ఫస్ట్ లుక్ చూశారా?

ర‌ష్మిక మంద‌న్న‌, షాహిద్ కపూర్‌, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న కాక్‌టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…

Saturday, 14 March 2026, 11:53 AM

వివాదాస్పద రనౌట్.. బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్‌లో హైడ్రామా! ‘క్రికెట్ స్ఫూర్తి’ ఎక్కడ?

పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…

Friday, 13 March 2026, 8:27 PM

సినిమాలకు సెన్సార్ బోర్డు కొత్త రూల్.. ఇక సబ్‌టైటిల్స్ తప్పనిసరి! మార్చి 15 నుంచి అమల్లోకి..

సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…

Friday, 13 March 2026, 5:41 PM

‘పిల్లలకు ఊపిరాడటం లేదు’.. ముంబై కాలుష్యంపై దీపికా పదుకొనె ఆందోళన! అధికారులకు ప్రశ్న.

ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…

Friday, 13 March 2026, 11:45 AM

28 రోజుల రీచార్జ్ ప్లాన్‌ పేరుతో దోపిడీ.. పార్లమెంట్‌లో రాఘవ్ చద్దా ఫైర్!

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…

Thursday, 12 March 2026, 7:33 PM