NTR : సుమ ఎక్కువగా నోరు పారేసుకుంటుంది.. ఎన్‌టీఆర్‌ కామెంట్స్‌ వైరల్..

March 21, 2022 1:33 PM

NTR : జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధానపాత్రలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం RRR. ఈ సినిమా 25వ తేదీన విడుదల కానుండడంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్, ఎన్టీఆర్, సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఎం.ఎం.కీరవాణి అడిగిన పలు ప్రశ్నలకు తారక్ ఎంతో ఆశక్తికరమైన సమాధానాలు ఇచ్చారు.

NTR comments on Anchor Suma viral
NTR

తన తండ్రి నటించిన సీతయ్య సినిమాను రీమేక్ చేస్తారా అంటూ కీరవాణి ప్రశ్నించగా తప్పకుండా చేస్తాను అంటూ ఎన్టీఆర్ సమాధానం చెప్పారు. ఇక తనకు గీతామాధురి వాయిస్ అంటే ఎంతో ఇష్టమని, కీరవాణి దర్శకత్వంలో వచ్చిన భీమవరం బుల్లోడ పాలు కావాలా అనే పాట ఏమాత్రం నచ్చదని ఎన్టీఆర్ వెల్లడించారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ ఎన్టీఆర్ సినిమాలో యాంకర్ సుమ కనుక నటిస్తే తనకు ఎలాంటి పాత్ర ఇస్తారని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు ఎన్టీఆర్ ఆసక్తికరమైన సమాధానాన్ని తెలియజేశారు. సుమకు నానమ్మ లేదా అమ్మమ్మ పాత్ర ఇస్తాను. తనకు చాదస్తం ఎక్కువ, ఆమెకు ముసలి పాత్రలే కరెక్ట్ గా సరిపోతాయి. ఎప్పుడు చూడు నోరు పారేసుకుంటూనే ఉంటుంది. తనని చూస్తే గయ్యాళి అత్త పాత్రలు గుర్తుకు వస్తాయి.. అంటూ ఎన్టీఆర్.. యాంకర్ సుమ గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఎన్టీఆర్ వ్యాఖ్యలపై సుమ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now