Noise ColorFit Icon Buzz : బ్లూటూత్ కాలింగ్ ఫీచ‌ర్‌తో నాయిస్ క‌ల‌ర్‌ఫిట్ ఐకాన్ బ‌జ్ స్మార్ట్ వాచ్‌.. ధ‌ర రూ.3,499 మాత్ర‌మే..!

Noise ColorFit Icon Buzz : ప్ర‌ముఖ ఆడియో ప్రొడ‌క్ట్స్‌, వియ‌ర‌బుల్స్ త‌యారీదారు నాయిస్‌.. ఓ స‌రికొత్త స్మార్ట్ వాచ్‌ను భార‌త్ లో విడుద‌ల చేసింది. నాయిస్ క‌ల‌ర్ ఫిట్ ఐకాన్ బ‌జ్ పేరిట విడుద‌లైన ఈ వాచ్‌లో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. ఇందులో బ్లూటూత్ కాలింగ్ స‌దుపాయం ల‌భిస్తుంది. 1.69 ఇంచుల ఫుల్ ట‌చ్ ఫ్లాట్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది 240 x 280 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌ను క‌లిగి ఉంది.

Noise ColorFit Icon Buzz

ఈ వాచ్‌లో 100కు పైగా క‌స్ట‌మైజ‌బుల్ అండ్ క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. 9 ర‌కాల స్పోర్ట్స్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. ర‌న్నింగ్, ట్రెడ్‌మిల్‌, వాకింగ్‌, స్పిన్నింగ్‌, సైక్లింగ్‌, యోగా, హైకింగ్‌, ఫిట్ నెస్ అండ్ క్లైంబింగ్ మోడ్స్ ఇందులో ల‌భిస్తున్నాయి.

ఈ వాచ్‌లో రోజుకు 24 గంట‌లూ హార్ట్ రేట్‌ను ప‌రిశీలించుకునే స‌దుపాయం అందుబాటులో ఉంది. అలాగే ఎస్‌పీవో 2 మానిట‌రింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. దీనికి వాయిస్ అసిస్టెన్స్ స‌దుపాయం ల‌భిస్తుంది. దీంతో కాల్స్ చేసుకోవ‌డంతోపాటు మ్యూజిక్ ప్లే చేయ‌వ‌చ్చు. వాతావ‌ర‌ణం, ఇత‌ర స‌మాచారం తెలుసుకోవ‌చ్చు. ఇందులో 2 ఇన్‌బిల్ట్ గేమ్స్‌ను కూడా అందిస్తున్నారు. రిమోట్ మ్యూజిక్‌, కెమెరా కంట్రోల్స్ స‌దుపాయం ఉంది. ఐపీ 67 వాట‌ర్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్‌ను ఈ వాచ్‌కు అందిస్తున్నారు. దీని వ‌ల్ల నీటిలోనూ ఈ వాచ్ భేషుగ్గా ప‌నిచేస్తుంది. పాడ‌వ‌దు.

నాయిస్ క‌ల‌ర్ ఫిట్ ఐకాన్ బ‌జ్ వాచ్ 7 రోజుల బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను అందిస్తుంది. కాల్స్ చేసుకుంటే 2 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్ ల‌భిస్తుంది. ఈ వాచ్ జెట్ బ్లాక్‌, సిల్వ‌ర్ గ్రే, ఆలివ్ గోల్డ్‌, మిడ్‌నైట్ గోల్డ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా.. దీని ధ‌ర రూ.3,499 ఉంది. అమెజాన్‌లో ఈ వాచ్ ను విక్ర‌యిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM