Nivetha Thomas : అరెరే.. నివేతాకి ఏమయ్యింది.. ఇలా అయిపోయిందేంటి..?

September 8, 2022 11:13 AM

Nivetha Thomas : తెలుగు ప్రేక్షకులకు నచ్చిన హీరోయిన్లలో మలయాళ బ్యూటీ నివేతా థామస్ ఒకరు. నేచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్ మెన్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది ఈ యంగ్ హీరోయిన్. ఆ తర్వాత రెండు, మూడేండ్ల పాటు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన నిన్ను కోరి చిత్రంలో నటించింది నివేతా. ఆ మూవీ క్లాసిక్ హిట్ గా నిలిచింది. అప్పటి నుంచి ఆమె నటనకు ఆస్కారం ఉన్న పాత్రలనే ఎంచుకుంటుంది.

గతేడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. తాజాగా దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో రెజీనా, నివేతా ప్రధాన పాత్రల్లో నటించిన శాఖిని డాకిని చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. చిత్ర యూనిట్ ప్రమోషన్లను కూడా ప్రారంభించింది. తాజాగా రెజీనా కాసాండ్రా తో కలిసి నివేదా ప్రమోషన్లలో కనిపించింది. నివేతాను చూసిన ఆమె అభిమానులు అరెరే.. నివేతా ఏంటి ఇలా అయిపోయింది? అని ఆశ్చర్యపోతున్నారు.

Nivetha Thomas what happened to her
Nivetha Thomas

బ్లాక్ డ్రెస్ లో అందంగా కనిపించిన నివేతా గతంలో కంటే కాస్త లావుగా కనిపిస్తుంది. గతంలో ఉన్న కల ముఖంలో కనిపించడం లేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి అల్లరి, యాక్టివ్ నెస్ తగ్గిపోయిందంటూ కొంత డిస్పాయింట్ అవుతున్నారు ఆమె ఫ్యాన్స్. ప్రస్తుతం దృశ్యం 2 దర్శకుడు జీతూ జోసెఫ్ రీమేక్ చేస్తున్న పాపనాశం 2 లో కూడా నటిస్తుంది నివేతా. ఈ సినిమాలో కమల్ హాసన్ కూతురి పాత్రలో నివేతా థామస్ నటిస్తున్నారు. అలాగే మరికొన్ని సినిమాల్లో కూడా నివేతా నటిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment