Niharika : మరోసారి ఓటీటీలో సందడి చేయనున్న నిహారిక.. OCFS అంటే..?

October 29, 2021 2:35 PM

Niharika : మెగా డాటర్ నిహారిక బుల్లితెరపై యాంకర్ గా తన ప్రస్థానం మొదలుపెట్టి అనంతరం మెగా కాంపౌండ్ నుంచి వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే నిహారిక పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

Niharika to act in another OTT what is OCFS

వెండితెరపై విజయాన్ని సాధించలేని నిహారిక ఆ తర్వాత వెబ్ సిరీస్ లో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ క్రమంలోనే ముద్దపప్పు ఆవకాయ, నాన్న కూచి వంటి వెబ్ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తాజాగా నిహారిక.. జీ5 నిర్మిస్తోన్న ఓ వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నట్లు తెలిసిందే. ఈ క్రమంలోనే నిహారిక ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేస్తూ OCFS హ్యాష్‌ట్యాగ్‌ను పోస్ట్ చేసి దీని అర్థం ఏంటో చెప్పగలరా.. మాకైతే ఎక్స్‌పెక్టేషన్స్‌ పీక్స్ అంటూ.. చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలోనే ఇది సినిమానా.. లేక వెబ్ సిరీసా అంటూ అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నాగబాబు పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని నిహారిక అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now