Niharika Konidela : ప‌బ్ సంఘ‌ట‌న అనంత‌రం.. నిహారిక న‌ష్ట నివార‌ణ‌కు రెడీ..? ఏం చేయ‌నుంది..?

 Niharika Konidela : మెగా డాట‌ర్ నిహారికకు ఒక‌ప్పుడు మంచి పేరు ఉండేది. డ్ర‌గ్స్ కేసు వ్య‌వ‌హారంతో అదంతా గంగ‌లో క‌లిపిన‌ట్టు అయింది. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో నిహారిక కొణిదెల కూడా ఉండ‌డం.. పోలీస్ స్టేషన్ నుంచి నిహారిక బయటకొస్తున్న దృశ్యాలు మీడియాలో సర్క్యులేట్ అవుతుండటం.. అదే స‌మ‌యంలో నిహారికపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జర‌గ‌డం మెగా అభిమానులని చాలా క‌ల‌వ‌ర‌ప‌రిచింది. ముఖ్యంగా నిహారికను టార్గెట్ చేస్తూ #DrugsQueenNiharika అనే హాష్ ట్యాగ్ లు ట్విట్ట‌ర్ లో తెగ ట్రెండ్ కాగా వాటిపై మెగా అభిమానులు ఘాటుగానే స్పందించారు.

Niharika Konidela

త‌న కూతురిపై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌కు నాగ‌బాబు కూడా దీటుగానే స‌మాధానం ఇచ్చారు. రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన ఘటనపై నేను స్పందించడానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్‌ను ప‌రిమితికి మించి న‌డ‌ప‌టం వ‌ల్ల పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. నిహారిక‌కు సంబంధించినంత వ‌ర‌కు త‌ను చాలా క్లియ‌ర్‌. ఇక్క‌డ పోలీసులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు నిహారిక విష‌యంలో ఎలాంటి త‌ప్పు లేద‌ని చెప్పారు. సోష‌ల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో ఎలాంటి అన‌వ‌స‌ర‌మైన పుకార్ల‌కు తావు ఇవ్వ‌కూడ‌ద‌ని నేను వీడియో రిలీజ్ చేస్తున్నాన‌ని అన్నారు. అంతేకాక ఓ డాగ్ వీడియోని కూడా విమ‌ర్శ‌ల‌కు స‌మాధానంగా త‌న సోష‌ల్ మీడియాలో నాగ‌బాబు షేర్ చేశారు.

అయితే ప‌బ్ సంఘ‌ట‌న‌ నిహారిక ఇమేజ్ ను చాలా డ్యామేజ్ చేసింది. నిహారిక ఈ నెగెటివిటీని త్వరలోనే తొలగించాలని కోరుకుంటోంది. త‌న సోష‌ల్ మీడియా ద్వారా చుట్టూ సానుకూల‌త‌ను సృష్టించే విధంగా ప్లాన్ చేస్తోంద‌ట‌. ఇప్పటికే తన ఇన్‌స్టాగ్రామ్‌ను డీయాక్టివేట్ చేసినందున, ఆమె ఒక స్టేట్‌మెంట్‌తో పునరాగమనం చేయనుంద‌ట‌. అలాగే తన తాజా వెబ్ సిరీస్ ట్రైలర్ విడుద‌ల‌ తర్వాత మీడియా ముందు హల్ చల్ చేయాలనుకుంటోంది. నిజానికి ఆమె ఓ సీరియల్ నిర్మిస్తూ మరో సినిమాలో నటిస్తోంది. మ‌రి ఇంత‌కు ముందు ఆమెకు ఉన్న పేరు మ‌ళ్లీ ఇప్పుడు వ‌స్తుందా.. లేదా.. అన్న‌ది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!

బ్యాటింగ్‌లో ప‌వ‌ర్ ప్లేలో ఎదురైన స‌మ‌స్య‌లు, ప్ర‌భావ‌వంతం కాని బౌలింగ్ వ‌ల్ల‌నే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ (SRH) జ‌ట్టు ఐపీఎల్…

Sunday, 29 March 2026, 9:59 PM

‘బాహుబలి 2’ రికార్డులు బ్రేక్.. నిర్మాత శోభు యార్లగడ్డ రియాక్షన్ ఇదే! ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ సునామీ..

ర‌ణ్‌వీర్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి వ‌సూళ్ల‌లో దూసుకెళ్తోంది.…

Sunday, 29 March 2026, 5:33 PM

అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పించింది నేనే.. రాధికా శరత్ కుమార్ షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్ యాక్టింగ్‌లోనే కాదు, డ్యాన్స్‌లోనూ ఎంతో ప్రావీణ్యుల‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఆయ‌న‌కు డ్యాన్స్ నేర్పింది తానేన‌ని సీనియ‌ర్…

Sunday, 29 March 2026, 3:04 PM

నా పెళ్లిపై వస్తున్న వార్తలు నమ్మకండి.. క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి!

ప్ర‌స్తుతం త‌న ధ్యాస‌, దృష్టి అంతా సినిమాల‌పైనే ఉంద‌ని, ఇప్ప‌ట్లో వివాహం చేసుకునే ఉద్దేశం లేద‌ని న‌టి సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం…

Saturday, 28 March 2026, 7:37 PM

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM

ఐపీఎల్ 2026 కొత్త రూల్స్ ఇవే.. కెప్టెన్లకు బీసీసీఐ క్లాస్! ఆ నిబంధనలపై కఠినంగా..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ జ‌ట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫ‌రీల‌తో ఓ…

Thursday, 26 March 2026, 10:40 PM

ఐపీఎల్ 2026 ఫుల్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది.. మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుద‌ల…

Thursday, 26 March 2026, 8:31 PM