Niharika Konidela : ఆంక్ష‌ల మ‌ధ్య నిహారిక జీవితం..? స్వేచ్ఛ‌ను స‌ద్వినియోగం చేసుకోనందుకే..?

April 14, 2022 9:51 PM

Niharika Konidela : కొణిదెల నిహారిక.. ఈ పేరు చెబితే నిన్న మొన్న‌టి వ‌ర‌కు చాలా మంది అభిమానించేవారు. ఆమె చేసే అల్ల‌రిని మెచ్చుకునేవారు. మెగా ఫ్యామిలీలో ముద్దుల కుమార్తెగా నిహారిక అల్ల‌రి చేస్తూ స‌ర‌దాగా తిరిగేది. కానీ అది గ‌తం. కేవ‌లం ఒక్క సంఘ‌ట‌న ఆమె లైఫ్‌ను త‌ల‌కిందులు చేసింది. ప‌బ్‌లో డ్ర‌గ్స్‌కు సంబంధించిన కేసు ఏమోగానీ.. నిహారిక పేరు మారుమోగిపోయింది. ఆమెకు అస‌లు డ్ర‌గ్స్‌తో సంబంధం ఉందా.. లేదా.. అన్న మాట ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు ఆమె జీవితం పూర్తిగా మారిపోయిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

Niharika Konidela life become hard in house
Niharika Konidela

గ‌తంలో నిహారిక ఆడింది ఆట‌గా.. పాడింది పాట‌గా ఉండేది. నాగ‌బాబు కూడా త‌న కుమార్తెకు స్వేచ్ఛ‌ను బాగానే ఇచ్చారు. ఆమె హీరోయిన్ అవుతాన‌ని చెప్పినా.. సరే అన్నారు. కానీ ఆమె న‌టించిన సినిమాలు హిట్ కాలేదు. దీంతో సిరీస్‌ల‌పై ప‌డింది. అక్క‌డా పెద్ద‌గా ఆద‌ర‌ణ లభించ‌లేదు. దీంతో పెద్ద‌ల సూచ‌న మేర‌కు నిహారిక పెళ్లి చేసుకుంది.

అయితే అత్త వారింట్లోనూ ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆ విష‌యాన్ని ఆమే ఒక పోస్టులో స్వ‌యంగా వెల్ల‌డించింది. అయితే ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ.. నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్ అయింది. ఆమె జిమ్ ట్రెయిన‌ర్‌తో చ‌నువుగా ఉండ‌డం ఆమె అత్తింటి వారికి న‌చ్చ‌లేద‌ని.. ఆ విష‌యంలో వారు ఆమెను మంద‌లించార‌ని.. క‌నుక ఆమె చిరాకు ప‌డి ఇన్‌స్టా ఖాతాను డిలీట్ చేసింద‌ని.. వార్త‌లు వ‌చ్చాయి. ఇందులో నిజం ఎంత అనేది తెలియ‌లేదు. కానీ ఆ త‌రువాత ప‌బ్ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. దీంతో నిహారికకు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి.

నిహారిక డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని నాగ‌బాబు చెప్పిన మాట‌ల‌ను న‌మ్మినా.. అర్థ‌రాత్రి 3 గంట‌ల స‌మ‌యంలో తెలుగు పండుగ రోజు భ‌ర్త లేకుండా ప‌బ్‌లో ఒక మ‌హిళ ఉండ‌డం ఏమిటి ? అని అంద‌రూ సూటిగా ప్ర‌శ్నించారు. దీనికి నాగ‌బాబు వ‌ద్ద స‌మాధానం లేకుండా పోయింది. అతిగా స్వేచ్ఛ‌ను ఇవ్వ‌డం వ‌ల్లే నిహారిక దాన్ని త‌ప్పుగా ఉప‌యోగించుకుంద‌ని స్ప‌ష్ట‌మైంది. క‌నుక‌నే ఆమెకు ఇప్పుడు అన్నీ క‌ఠిన‌మైన ఆంక్ష‌ల‌ను విధించార‌ట‌. దీంతో ఆమె ఇంట్లో నుంచి ఇప్పుడు బ‌య‌ట‌కు ఎక్క‌డికీ వెళ్ల‌డం లేదట‌. ఒక ర‌కంగా చెప్పాలంటే కొంత కాలం పాటు ఆమె ఇంట్లోనే బందీ అయిన జీవితం గ‌డుపుతుంద‌ని తెలుస్తోంది.

అయితే నిహారిక ఆమెకు ఇచ్చిన స్వేచ్ఛను స‌ద్వినియోగం చేసుకోలేద‌ని.. అందువ‌ల్లే ఆమెపై ఇప్పుడు పుట్టింటి వారు, అత్తింటి వారు ఆంక్ష‌ల‌ను విధించార‌ని ప్ర‌చారం జరుగుతోంది. మ‌రి ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విష‌యం తెలియాల్సి ఉంది. ఒక‌వేళ అదే నిజ‌మైతే నిహారిక ఇక స్వేచ్ఛగా జీవించ‌డం కుద‌ర‌దు. ఒక ర‌కంగా చెప్పాలంటే త‌న స్వేచ్ఛను తానే చేజేతులా వ‌దులుకుంద‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now