నాకు అండ‌గా ఉన్నందుకు థ్యాంక్స్‌.. నిహారిక ఎమోష‌న‌ల్ పోస్ట్‌..

August 19, 2022 2:17 PM

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీలలో మెగా డాటర్ నిహారిక కొణిదెల ఒకరు. ఒకవైపు వెబ్ సిరీస్ ల‌లో నటిస్తూ, మరొకవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది నిహారిక. సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నిహారికకు ఫ్రెండ్ సర్కిల్ చాలానే ఉంది. స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ వరకు ఉన్న స్నేహితులతోపాటు, సినీ వర్గానికి సంబంధించిన స్నేహితులు కూడా ఎంతోమంది ఉన్నారు. నిత్యం టూర్లు, పార్టీలు అంటూ స్నేహితులతో తెగ‌ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది నిహారిక. ఇటీవల నిహారిక సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఒక మెసేజ్ అందరి దృష్టినీ ఆకర్షించింది.

నిహారిక స్నేహితుల గ్యాంగ్ లో కాల‌ భైరవ కూడా ఒకరు. నిహారిక పెట్టిన మెసేజ్ చూస్తుంటే వీళ్ళ ఇద్దరికీ మంచి ప్రత్యేకమైన బంధం ఉందని అనిపిస్తోంది.  కాల‌భైరవ కోసం నిహారిక చేసిన పోస్టులు చూసి నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు. ఇంతకీ ఏంటా పోస్ట్ అనుకుంటున్నారా.. ఆ పోస్ట్ లో ఉన్న సారాంశం ఏమిటంటే..

niharika konidela emotional post about her friend kala bhairava

హ్యాపీ బర్త్ డే భైరి బాబు.. నువ్వు నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను. నువ్వు నా ప్రతి అవసరంలోనూ నాకు అండగా, తోడుగా ఉన్నందుకు థ్యాంక్స్.. ఈ ప్రపంచంలో సంతోషమంతా నీకు అందుకునే అర్హత ఉంది.  ఐ లవ్యూ.. నీ అద్భుతమైన గాత్రంతో ఎన్నో చిత్రాలకు పాటలు పాడాల‌ని ఆశిస్తున్నాను. అంతే కాకుండా ఎంతో మంచి సంగీతాన్ని అందించాలి.. అంటూ తన తరపున కాల‌భైరవకు విషెస్ తెలిపింది మెగా డాటర్ నిహారిక.

అంతేకాకుండా నిహారిక సీతారామం సినిమా చూసి ఎంతో ఎమోషనల్ అయిందట. ఈ చిత్రంలో ప్రొడక్షన్ డిజైన్ గానీ, దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం గానీ ఎంతో అద్భుతంగా ఉంది అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. ఈ మధ్య కాలంలో విడుదలైన‌ మంచి చిత్రాలలో ఇది ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతగానో ఆకర్షిస్తుంది, క‌చ్చితంగా చూడవలసిన‌ చిత్రాలలో ఇది ఒకటి.. అంటూ చెప్పుకొచ్చింది నిహారిక.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now