Samantha : సమంత, చైతన్య విడాకులకు ప్రధాన కారణం అదే.. అంటున్న నెటిజన్లు..!

October 3, 2021 7:34 AM

Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వీట్ కపుల్ గా ఉంటూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న చై -సామ్ గత ఏడు సంవత్సరాలుగా ప్రేమలో ఉండి వివాహ బంధంతో ఒకటయ్యారు. గత నాలుగేళ్లుగా వైవాహిక జీవితంలో ఎంతో ఆనందంగా గడిపిన వీరు ఉన్నపళంగా ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Samantha : సమంత, చైతన్య విడాకులకు ప్రధాన కారణం అదే.. అంటున్న నెటిజన్లు..!

వీరి విడాకుల గురించి గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని భావించిన అభిమానులకు నాగ చైతన్య షాకింగ్ విషయం తెలియజేశారు. సమంతతో విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకుంటున్నామని తెలిపారు. అయితే ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నా ప్రధాన కారణం మాత్రం అదేనని నెటిజన్లు భావిస్తున్నారు.

సమంత పెళ్లి తర్వాత ఎన్నో సినిమాలను చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా సమంత నటించిన ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 సిరీస్ ఇంత దారుణానికి పాల్పడిందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రాజీ అనే పాత్రలో ఎంతో బోల్డ్ గా నటించిన సమంతను చూసి అక్కినేని కుటుంబం జీర్ణించుకోలేక పోయింది. ఈ క్రమంలోనే సమంతతో మనస్పర్థలు ఏర్పడటం కారణంగా ఈ విధమైన తీసుకున్నారని అభిమానులు భావిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now