Keerthy Suresh : కీర్తిసురేష్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు.. కార‌ణం అదే..!

May 13, 2022 10:00 AM

Keerthy Suresh : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన లేటెస్ట్ చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించి రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల దిశ‌గా దూసుకుపోతోంది. ఇక ఇందులో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టించింది. ఈ అమ్మ‌డికి అస‌లు మ‌హాన‌టి మూవీ త‌రువాత హిట్స్ లేవు. మ‌రోవైపు మ‌హేష్.. మ‌హ‌ర్షి, సరిలేరు నీకెవ్వ‌రు మూవీల‌తో వ‌రుస విజ‌యాల‌ను అందుకున్నారు. దీంతో కీర్తిసురేష్ లాంటి ఐర‌న్ లెగ్ హీరోయిన్‌ను ఎందుకు తీసుకున్నారంటూ.. గ‌తంలోనే మ‌హేష్ ఫ్యాన్స్ అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఆమె వ‌ల్ల సినిమా ఫ్లాప్ అవుతుందేమోన‌ని కంగారు ప‌డ్డారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. సినిమా పాజిటివ్ టాక్‌నే సొంతం చేసుకుంది. అయితే కీర్తి సురేష్‌ను మాత్రం నెటిజ‌న్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

స‌ర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ భిన్న‌మైన పాత్ర‌లో న‌టించింది. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు త‌గిన‌ట్లుగా పాత్ర‌లు చేసే ఆమె ఒక్క‌సారిగా మందుకు, జూదానికి బానిస అయిన‌ట్లుగా ఈ మూవీలో న‌టించింది. అయితే ఫ్యామిలీ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న‌కీర్తి సురేష్ ఈ మూవీలో అలాంటి పాత్ర‌లో కనిపించే సరికి నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. గ‌తంలో ఏ సినిమా చూసుకున్నా ఆమె ఎంతో ప‌ద్ధ‌తిగా ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు క‌నెక్ట్ అయ్యే పాత్ర‌ల్లో న‌టించింది. కానీ స‌ర్కారు వారి పాట‌లో మాత్రం అందుకు భిన్నంగా.. మందులో మునిగి తేలే పాత్ర‌లో న‌టించింది. పైగా సినిమాలో ఆమె పాత్ర చిత్రీక‌ర‌ణ ఏమంత బాగా లేదు. మాటి మాటికీ విసిగిస్తుంటుంది. అస‌లు ఆమె తెర‌పై క‌నిపిస్తేనే.. ఎప్పుడు వెళ్లిపోతే బాగుంటుందా.. అన్న‌ట్లు ప్రేక్ష‌కులు ఫీల‌వుతున్నారు. చాలా విసుగు, కోపం తెప్పించే పాత్ర‌లో ఆమె క‌నిపించింది. పైగా మ‌ద్యం, జూదం.. వీటికి బానిస‌గా.. అప్పుల మీద అప్పులు చేసే చెడ్డ యువ‌తిగా క‌నిపించింది. ఇది ప్రేక్ష‌కులకు న‌చ్చ‌లేదు.

netizens comments on Keerthy Suresh for her character in Sarkaru Vaari Paata movie
Keerthy Suresh

కీర్తి సురేష్ అంటే హోమ్లీ పాత్ర‌ల‌కు పెట్టింది పేరు. అలాంటిది ఆమె ఇలా చేసింది ఎందుక‌బ్బా.. అని ప్రేక్ష‌కులు ఆలోచిస్తున్నారు. అయితే పాత్ర అలాంటిది.. చిత్ర క‌థ‌కు అవ‌స‌రం.. అని స‌రిపెట్టుకుందామ‌నుకుంటే.. ఇంకో ప్ర‌శ్న వ‌స్తుంది. అస‌లు ఆమె ఇలాంటి పాత్ర‌కు ఎందుకు ఒప్పుకుంది.. ఇలాంటి పాత్ర చేస్తే నెగెటివ్ ఇమేజ్ ప‌డుతుంది క‌దా.. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు న‌చ్చ‌దు క‌దా.. అన్న ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. అన్నీ తెలిసే కీర్తి సురేష్ ఈ పాత్ర‌కు ఒప్పుకుంద‌ని.. ఆమె అస‌లు ఇలాంటి పాత్ర‌ల‌లో న‌టించ‌వ‌ద్ద‌ని.. కానీ న‌టించి త‌ప్పు చేసింద‌ని అంటున్నారు. దీని వ‌ల్ల ఆమె కెరీర్‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంటున్నారు. ఈ సినిమాలో ప్రేక్ష‌కుల‌కు ఆమె పాత్ర విసుగు, కోపం తెప్పిస్తాయి. క‌నుక ఈమె పాత్ర‌ను వారు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే కీర్తి సురేష్‌ను నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ మూవీతో అయినా ఈ అమ్మ‌డి ద‌శ తిరుగుతుందా.. లేక అవ‌కాశాలు త‌గ్గుతాయా.. అన్న విష‌యం వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now