Naga Babu : నాగ‌బాబు.. నీవ‌ల్లే భార‌త్ ఓడిపోయింది.. నెటిజ‌న్స్ ట్రోలింగ్‌..

October 25, 2021 12:58 PM

Naga Babu : మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు అంటే ఇండ‌స్ట్రీలో చాలా మందికి ప్ర‌త్యేక గౌర‌వం ఉంటుంది. ముఖ్యంగా జ‌బ‌ర్ధ‌స్త్ న‌టీన‌టులు నాగ‌బాబుని చాలా ఇష్ట‌ప‌డుతుంటారు. ప‌లు సంద‌ర్భాల‌లో నాగ‌బాబు వారికి అండ‌గా కూడా నిలిచారు. అయితే మా ఎల‌క్ష‌న్స్ స‌మ‌యంలో నాగ‌బాబు చేసిన కొన్ని కామెంట్స్ ఆయ‌న‌పై బాగా నెగెటివిటీని తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా కోట శ్రీనివాస‌రావు లాంటి పెద్ద స్టార్‌ని ప‌ట్టుకొని దారుణంగా మాట్లాడారు.

netizen trolling Naga Babu for india loss against pakisthan

ఈ క్ర‌మంలో నాగ‌బాబుని తెగ ట్రోల్ చేస్తున్నారు. ప్ర‌కాశ్ రాజ్ ఓడిపోవ‌డానికి కార‌ణం నాగ‌బాబే అంటూ అప్పుడు కొంద‌రు రచ్చ చేయ‌గా, ఇప్పుడు భార‌త్‌-పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో ఇండియా ఓడిపోవ‌డానికి నాగ‌బాబు కార‌ణ‌మంటూ కొంద‌రు ఆరోపిస్తున్నారు. అస‌లు భార‌త్ ఓడిపోవ‌డానికి, నాగ‌బాబుకి ఏం సంబంధం ఉంద‌నే క‌దా మీ డౌట్..! ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్ ని లైవ్ లో చూసేందుకు చాలామంది సెలబ్రిటీలు దుబాయ్ వెళ్లారు. వారిలో నాగబాబు కూడా ఒకరు.

త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ తో క‌లిసి మ్యాచ్ చూస్తున్న ఫొటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, దానిపై తెగ ట్రోలింగ్ న‌డుస్తోంది. నాగబాబుది ఐరన్ లెగ్ అని, అందుకే ఆయన అడుగు పెట్డడంతో ఇండియా ఓడిపోయిందని అంటున్నారు. నాగబాబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఓటమే అని ఓ రేంజ్ లో సెటైర్స్ వేస్తున్నారు. జ‌నసేనలో ఎంట్రీ ఇచ్చారు, ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మా ఎన్నికల్లో ప్ర‌కాశ్ రాజ్‌కి స‌పోర్ట్ చేశారు, ఆయ‌న ఓడిపోయారు. ఇప్పుడు దుబాయ్ వెళ్లారు, ఇండియాని ఘోరంగా ఓడించి ఇంటికొచ్చారు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now