Thaman : థ‌మ‌న్ మ‌ళ్లీ కాపీ కొట్టాడా ? స‌ర్కారు వారి పాట‌లోని ఆ సాంగ్ అల్లు అర్జున్ సినిమాలోని ఆ పాట‌కు కాపీనా..?

May 8, 2022 8:28 AM

Thaman : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మ‌హాన‌టి ఫేమ్ కీర్తి సురేష్ జంట‌గా క‌లసి న‌టించిన చిత్రం.. స‌ర్కారు వారి పాట‌. ఈ మూవీ మే 12వ తేదీన విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలోనే లేటెస్ట్‌గా సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వ‌హించారు. ఇక ఈ మూవీకి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. థ‌మ‌న్ సంగీతం అందించారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా నుంచి విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆక‌ట్టుకుంటున్నాయి. గ‌తంలో వ‌చ్చిన సినిమాల‌కు భిన్నంగా మ‌హేష్ ఈ మూవీలో భిన్న‌మైన లుక్‌, మాన‌రిజంలో క‌నిపించ‌నున్నారు. అయితే తాజాగా విడుద‌ల చేసిన మ‌.. మ‌.. మ‌హేషా.. సాంగ్‌కు విప‌రీత‌మైన స్పంద‌న ల‌భిస్తోంది.

netizen troll Thaman may be he copied that song
Thaman

అయితే థ‌మ‌న్ అంటేనే గ‌తంలో వ‌చ్చిన సినిమాల్లోని పాట‌ల‌ను కాపీ చేసి వాడుకుంటాడ‌నే మ‌చ్చ ఉంది. దీంతో ఇప్పుడు కూడా థ‌మ‌న్‌ను అదే విష‌యంలో ట్రోల్ చేస్తున్నారు. మ‌.. మ‌.. మ‌హేషా సాంగ్ గ‌తంలో వ‌చ్చిన అల్లు అర్జున్ మూవీ స‌రైనోడులోని బ్లాకు బ‌స్ట‌ర్‌.. బ్లాకు బ‌స్ట‌రే.. పాట‌ను పోలి ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ పాట‌.. ప్ర‌స్తుత పాట సంగీతం ఒకేలా ఉంద‌ని అంటున్నారు. థ‌మ‌న్ మ‌ళ్లీ కాపీ కొట్టాడ‌ని వారు విమ‌ర్శిస్తున్నారు.

అయితే త‌న‌పై ఎప్పుడూ ఈ విధంగా వ‌చ్చే ట్రోల్స్‌ను, విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోన‌ని థ‌మ‌న్ గ‌తంలోనే చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు కూడా ఈ ట్రోల్స్‌ను ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే ప్రీ రిలీజ్ వేడుక‌లో థ‌మ‌న్ ను మ‌హేష్ ఆకాశానికెత్తారు. క‌ళావ‌తి సాంగ్ అద్భుతంగా వ‌చ్చింద‌ని.. ఆ క్రెడిట్ అంతా థ‌మ‌న్‌కే ద‌క్కుతుంద‌ని మ‌హేష్ కొనియాడారు. ఇక స‌ర్కారు వారి పాట‌లోని క‌ళావ‌తితోపాటు ఆ త‌రువాత వ‌చ్చిన పెన్నీ సాంగ్ కూడా ఆక‌ట్టుకుంటోంది. ఈ మూవీకి థ‌మ‌న్ చ‌క్క‌ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను అందించార‌ని మ‌హేష్ అన్నారు. మ‌రి మూవీలో బీజీఎం ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now