Mohan Babu : మ‌ళ్లీ మొద‌లు.. మోహ‌న్‌బాబుపై దారుణ‌మైన ట్రోల్స్‌.. ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నారు..

August 1, 2022 4:06 PM

Mohan Babu : సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబుపై ట్రోల్స్ ఇప్ప‌ట్లో ఆగేలా లేవు. ఆయ‌న‌తోపాటు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను కూడా నెటిజ‌న్లు ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మంచు విష్ణు మా ప్రెసిడెంట్ అయిన‌ప్ప‌టి నుంచి ఈ ట్రోల్స్ ఎక్కువ‌య్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. అలాగే ఏపీలో సినీ రంగ స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించ‌డంలోనూ మంచు విష్ణు ఫెయిల్ అయ్యార‌ని చెప్పి నెటిజ‌న్లు అప్ప‌టి నుంచి మంచు ఫ్యామిలీని టార్గెట్ చేశారు. దీంతో ఎప్ప‌టిక‌ప్పుడు మంచు ఫ్యామిలీపై ట్రోల్స్ పెరిగిపోతూనే ఉన్నాయి.

ఇక మోహ‌న్‌బాబు న‌టించిన స‌న్నాఫ్ ఇండియా మూవీపై అయితే ఏ తెలుగు సినిమాపై రానన్ని ట్రోల్స్ వ‌చ్చాయి. దీంతో నొచ్చుకున్న మంచు మోహ‌న్ బాబు, విష్ణు త‌మ‌ను ట్రోల్ చేస్తే రూ.10 కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేస్తామని హెచ్చ‌రించారు. అయితే దీనిపై కూడా ట్రోల్స్ చేయ‌డం మొద‌లు పెట్టారు. అయితే ఆ త‌రువాత వారు సైలెంట్ అయిపోయారు కానీ వారిపై వ‌చ్చే ట్రోల్స్ మాత్రం ఆగ‌లేదు. ఇక తాజాగా మ‌రోమారు మంచు మోహ‌న్ బాబు దొరికిపోయారు. ఆయ‌న‌ను ఒక రేంజ్‌లో నెటిజ‌న్లు ఆడుకుంటున్నారు. తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఆయ‌నపై విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.

netizen once again troll Mohan Babu for his latest movie poster
Mohan Babu

మంచు ల‌క్ష్మి న‌టిస్తూ నిర్మిస్తున్న మూవీ అగ్ని న‌క్ష‌త్రం. ఇందులో ఆమెతోపాటు మోహ‌న్ బాబు కూడా ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇందులో తాను ప్రొఫెస‌ర్ విశ్వామిత్ర‌గా న‌టిస్తున్నాన‌ని చెప్పారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ట్వీట్ కూడా చేశారు. అయితే ఆ ట్వీట్‌కు చివ‌ర్లో త‌న‌కు భ‌యంగా ఉంద‌ని చెప్పారు. ఇదే నెటిజ‌న్లకు అస్త్రంగా మారింది. ఈ వాక్యాన్ని ఉద్దేశించే ఆయ‌న‌ను మ‌రోమారు ట్రోల్ చేస్తూ తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు.

సినిమా తీస్తున్న మీకే ఇంత భ‌యంగా ఉంటే.. దాన్ని చూసే మాకు ఎంత భ‌యంగా ఉండాలి.. అని నెటిజ‌న్లు ఆయ‌న ట్వీట్‌కు కౌంట‌ర్ ఇస్తున్నారు. అలాగే స‌న్నాఫ్ ఇండియా సెకండ్ పార్ట్ రాబోతోంది.. అంటూ మ‌రికొంద‌రు సెటైర్లు వేస్తున్నారు. ఇక కొంద‌రైతే మోహ‌న్ బాబును ఫైర్ స్టార్ అంటూ ఆట ప‌ట్టిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అన‌వ‌స‌రంగా ట్రోలింగ్‌కు గుర‌వుతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే దీనిపై ఆయ‌న గానీ.. మంచు ఫ్యామిలీగానీ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now