Rana Daggubati : రానాను అవ‌మానించిన నెటిజ‌న్‌.. దీటుగా బ‌దులిచ్చిన రానా..!

June 4, 2022 8:22 AM

Rana Daggubati : సెల‌బ్రిటీలు అన్నాక విమ‌ర్శ‌లు, పొగ‌డ్త‌లు స‌హ‌జం. వారు చేసే కొన్ని ప‌నుల‌కు లేదా వారు తీసే సినిమాల‌కు కొన్ని సార్లు విమ‌ర్శ‌లు వ‌స్తుంటాయి. కొన్ని సార్లు పొగడ్త‌లు వ‌స్తుంటాయి. అయితే చాలా మంది సెల‌బ్రిటీలు విమ‌ర్శ‌లు అయినా, పొగ‌డ్త‌లు అయినా.. పెద్ద‌గా ప‌ట్టించుకోరు. త‌మ ప‌ని తాము చేసుకుపోతుంటారు. కానీ కొంద‌రు మాత్రమే వాటిని ప‌ట్టించుకుంటారు. పొగడ్త‌లు చేసే వారికి థ్యాంక్స్ చెబుతారు. విమ‌ర్శించే వారికి దీటుగా బ‌దులిస్తారు. ప్ర‌స్తుతం రానా కూడా అలాగే చేశాడు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

ద‌గ్గుబాటి రానా, సాయిప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం.. విరాట ప‌ర్వం. ఈ సినిమా నుంచి కొత్త పోస్ట‌ర్‌ను ఈమ‌ధ్యే లాంచ్ చేశారు. అందులో రానా ముఖం క‌నిపించ‌డం లేదు. కానీ ఆయ‌న‌ను హ‌గ్ చేసుకున్న సాయిప‌ల్ల‌వినే హైలైట్ చేసి చూపించారు. అయితే రానాను వ‌దిలేసి ఆమె మీద ఫోక‌స్ పెట్ట‌డంపై ఓ నెటిజ‌న్ రానాను విమ‌ర్శించాడు. ఛీ ద‌రిద్రం.. సొంత బ్యాన‌ర్‌లోనే ఫేస్ క‌ట్ చేశారు. ఇక బ‌య‌టి వాళ్లు వేలెత్తి చూపించ‌డంలో త‌ప్పేముందిలే.. వాళ్ల వీళ్ల సినిమాల్లో త‌క్కువ క్యారెక్ట‌ర్స్ చేయ‌డం అంద‌రికీ లోకువ అయిపోవ‌డం.. ఇది రానాకు స‌హ‌జ‌మేగా.. అంటూ ఆ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. అయితే ఇందుకు రానా స్పందించారు. స‌ద‌రు నెటిజ‌న్‌కు చెంప పెట్టు లాంటి స‌మాధానం ఇచ్చారు.

netizen insulted Rana Daggubati he has given strong reply
Rana Daggubati

మ‌నం త‌గ్గి క‌థ‌ను, హీరోయిన్‌ను ఎలివేట్ చేయ‌డంలో ఉండే కిక్కే వేరు బ్ర‌ద‌ర్. సొంత బ్యాన‌ర్ క‌దా. గొప్ప ప‌నులు ఇక్క‌డే చేయ‌వ‌చ్చు.. అని రానా బ‌దులిచ్చారు. దీంతో ఆ నెటిజ‌న్‌కు గూబ గుయ్‌మ‌ని అనిపించి ఉంటుంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ నెటిజ‌న్‌కు దీటుగా బ‌దులిచ్చావ‌ని రానాపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక విరాట ప‌ర్వం షూటింగ్ ఎప్పుడో ముగిసినా ఈ మూవీ అనేక కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు దీన్ని జూన్ 17న రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. శ్యామ్ సింగ‌రాయ్ త‌రువాత వ‌స్తున్న సాయిప‌ల్ల‌వి సినిమా కావ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now