Tamannaah : సాధారణంగా సినిమా రంగంలోకి వచ్చే నటి ఎవరైనా సరే.. హీరోయిన్ గా కొంత కాలమే కొనసాగుతారు. ఎల్లకాలం ఉండలేరు. కానీ తమన్నా రూటే వేరు. ఆమె సినీ ఇండస్ట్రీలోకి వచ్చి సుమారుగా 12 ఏళ్లకు పైగానే అవుతోంది. అయినప్పటికీ వన్నె తగ్గని అందం ఆమె సొంతం. అలాగే ఇప్పటికీ ఆమెకు వరుస ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ అలరిస్తుండగా.. ఇంకొన్ని సినిమాల్లో నెగెటివ్ క్యారెక్టర్లను సైతం చేస్తోంది. ఇక తమన్నా లేటెస్ట్‌గా కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో మెరిసింది. అక్కడ ఈమె చేసిన సందడి అంతా ఇంతా కాదు.
కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ముద్దుగుమ్మలు కూడా పాల్గొన్నారు. పూజా హెగ్డె కూడా సందడి చేసింది. ఇక ఈమెతోపాటు తమన్నా కూడా గ్లామరస్ డ్రెస్ ధరించి అందాలను ఆరబోసింది. దీంతో తమన్నా ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే మళ్లీ తమన్నా తన డీగ్లామర్ ఫొటోలను షేర్ చేసింది. అందులో మేకప్ లేకుండా ఉన్న ఆమెను చూడవచ్చు. సాధారణంగా తమన్నా అంటే.. మనకు మిల్కీ బ్యూటీలాంటి అందాలు గుర్తుకు వస్తాయి. కానీ మేకప్ లేకుండా అసలు తమన్నాను చూడలేకపోతున్నాం.. అంటే నమ్మండి. ఇక ఈమె ఫొటోలపై నెటిజన్లు అనేక రకాల కామెంట్లు చేస్తున్నారు.
మేకప్ లేకుండా అసలు బాగాలేవు.. మేకప్‌తో కనిపించు.. బాబోయ్, అసలు చూడలేకపోతున్నాం.. అంటూ నెటిజన్లు తమన్నా ఫొటోల పట్ల కామెంట్లు చేస్తున్నారు. ఇక తమన్నా నటించిన ఎఫ్3 మూవీ ఈ నెల 27వ తేదీన విడుదల కానుండగా.. ఇందులో ఈమె వెంకటేష్‌కు జోడీగా నటించింది. దీంతోపాటు పలు ఇతర సినిమాలతోనూ తమన్నా బిజీగా ఉంది.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…