Pooja Hegde : బుట్టబొమ్మగా అల వైకుంఠపురములో మూవీతో అలరించిన పూజా హెగ్డె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె గతేడాది అనేక చిత్రాల్లో నటించగా.. అవన్నీ హిట్ అయ్యాయి. అయితే ఈ ఏడాది ఆమెకు కలసి రాలేదనే చెప్పాలి. ఈ ఏడాది విడుదలైన రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య మూవీలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఈమెకు కెరీర్ ఆరంభంలో పడిన ఐరన్ లెగ్ అన్న ముద్ర మళ్లీ వచ్చేసింది. అయినప్పటికీ ఈమెకు అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ఇక పూజా హెగ్డె తాజాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో మెరిసింది. ఆమె అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంచి మార్కులను కొట్టేసింది. అయితే వాస్తవానికి ఫిలిం ఫెస్టివల్ సందర్భంగా పూజా హెగ్డె పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఆమె తన దుస్తులను, మేకప్ సామగ్రిని కోల్పోయింది. అయినప్పటికీ ఎంతో కష్టపడి చక్కని డ్రెస్ ధరించి మేకప్ చేసుకుని తిరిగి ఫెస్టివల్‌లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించింది.
పూజా హెగ్డె కేన్స్ కు వెళ్లేటప్పుడే ఆమెను ఇండియాలోనే ఎయిర్ పోర్టు వద్ద ఆపేశారు. దీంతో రెండు బ్యాగుల్లో ఒక బ్యాగును ఇక్కడే వదిలి వెళ్లింది. అయితే ఆమె కేన్స్‌కు చేరుకున్న తరువాత లగేజ్‌ను పోగొట్టుకుంది. తాను ఫిలిం ఫెస్టివల్‌లో ధరించాలనుకున్న డ్రెస్‌తోపాటు మేకప్ సామగ్రి మొత్తం ఆ లగేజ్‌లోనే ఉంది. దీంతో పూజా హెగ్డె ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేన్స్‌లోనే షాపింగ్ చేసి ఒక డ్రెస్‌ను అప్పటికప్పుడు కొనుగోలు చేసింది. తరువాత తన సిబ్బంది సహాయంతో కష్టపడి మేకప్ సామగ్రిని తెప్పించుకుంది. ఆ తరువాత ఆమె రెడీ అయి ఫిలిం ఫెస్టివల్‌కు హాజరైంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏమాత్రం తేడా జరిగినా ఆమె అసలు ఫెస్టివల్‌లో పాల్గొనలేకపోయేది. కానీ ఎట్టకేలకు అంతా హ్యాపీగానే ముగిసింది. ఇక ఈ వివరాలను పూజా స్వయంగా వెల్లడించింది.
ఫిలిం ఫెస్టివల్‌కు తాను వెళ్లి వచ్చే వరకు తాను, తన సిబ్బంది ఎవరూ నిద్రపోలేదని, ఆహారం కూడా తీసుకోలేదని.. అయితే ఫెస్టివల్‌కు వెళ్లి వచ్చాక అప్పటికి తన ఆందోళన తగ్గిందని.. తనకు అందరూ కాంప్లిమెంట్స్ ఇస్తుంటే తాను పడిన కష్టం అంతా మరిచిపోయానని.. పూజా హెగ్డె తెలియజేసింది. ఇక ఫెస్టివల్ నుంచి తిరిగి వచ్చాక తన సిబ్బందితో కలిసి తాను ఒక హోటల్‌లో మంచి డిన్నర్ చేశామని చెప్పింది. తనకు గతంలో ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని.. టైముకు అన్నీ లభించాయి కాబట్టే ఫెస్టివల్‌లో పాల్గొనగలిగానని.. లేదంటే తనకు ఇబ్బందిగా అనిపించేదని పూజా తెలిపింది. ఈ క్రమంలోనే పూజా పడ్డ కష్టానికి నెటిజన్లు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె త్వరలోనే మహేష్, త్రివిక్రమ్ సినిమాలో నటించనుంది. అలాగే పలు ఇతర ప్రాజెక్టులు కూడా ఈమె చేతిలో ఉన్నాయి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…