Viral Video : ప్రమాదాలు అనేవి చెప్పి జరగవు. చెప్పకుండానే జరుగుతాయి. అవి అకస్మాత్తుగా చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు. మనం రోడ్డుపై వాహనంపై వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వెంట్రుక వాసిలో ప్రమాదం చోటు చేసుకుంటుంది. మనం వాటి నుంచి బతికి బయటపడేది చాలా తక్కువ సందర్భాల్లోనే అని చెప్పాలి. అయితే ఆ వ్యక్తి మాత్రం కారు వెనుక నుంచి ఢీకొన్నా ఏమీ కాలేదు. కారణం.. హెల్మెట్ పెట్టుకోవడమే. అయితే అంతటి ప్రమాదంలోనూ ఆ వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని ఇంకో వ్యక్తి దొంగిలించేందుకు యత్నించాడు. ఇక చివరికి ఏం జరిగిందంటే..
రద్దీగా ఉన్న రోడ్డుపై స్కూటీ మీద వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టింది. దీంతో స్కూటీతో సహా ఆ వ్యక్తి ముందుకు ఎగిరిపడ్డాడు. అయితే అతని అదృష్టం బాగుంది కాబోలు.. అంతగా పడిపోయినా.. అతనికి దెబ్బలు ఏమీ తగల్లేదు. కారణం.. అతను హెల్మెట్ ధరించడమే అని చెప్పవచ్చు. ఇక తన స్కూటీని నిలబెట్టేందుకు చుట్టూ ఉన్న కొందరు వచ్చారు. అయితే అతను తన స్కూటీ వద్ద ఉండకుండా.. తనను వెనుక నుంచి ఢీకొన్న వ్యక్తిని ఆపాడు. అతని కారు వద్దకు వెళ్లి అతనితో గొడవ పడసాగాడు.
అయితే ఆ వ్యక్తి స్కూటీని నిలబెట్టేందుకు హెల్ప్ చేస్తున్నట్లు నటించిన ఓ వ్యక్తి సందు చూసుకుని ఆ స్కూటీని అక్కడి నుంచి దొంగిలించి తీసుకెళ్లబోయాడు. కానీ రోడ్డు బాగా లేకపోవడం.. అతను స్కూటీ ఎక్కకపోవడం కారణంగా.. అతనికి అది కంట్రోల్ కాలేదు. దీంతో కొంత దూరం వరకు వెళ్లిన ఆ వ్యక్తి అక్కడే పడిపోయాడు. ఇది చూసిన స్కూటీ ఓనర్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. ఈ తతంగం మొత్తం అక్కడే ఉన్న సీసీకెమెరాల్లో రికార్డయింది. ఈ క్రమంలోనే ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే తరువాత ఏం జరిగింది.. అన్న విషయం తెలియలేదు. కానీ ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. బైక్‌ను దొంగిలించాలనుకున్న వ్యక్తికి సరైన గుణపాఠం ఇన్‌స్టంట్‌గా లభించింది.. అంటూ నెటిజన్లు ఈ వీడియో పట్ల కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటికే 53వేలకు పైగా వ్యూస్, 7300కు పైగా లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…