Samantha : సోషల్ మీడియాలో సమంత ఈ మధ్య కాలంలో విపరీతమైన విమర్శలను, ట్రోల్స్‌ను ఎదుర్కొంటోంది. ఆమె ఏ పోస్టు పెట్టినా విపరీతంగా విమర్శిస్తున్నారు. అయితే ఆమె చేయడం కూడా అలాగే చేస్తుందని చెప్పవచ్చు. గతంలో చైతూతో కలసి ఉన్నప్పుడు ఆమె ఇంతగా గ్లామర్ షో చేయలేదు. ఎప్పుడో వెకేషన్స్ కు వెళ్లినప్పుడు లేదా సినిమాల్లో.. ఇతర కార్యక్రమాల్లోనే కాస్త పద్ధతిగానే దుస్తులను ధరించేది. కానీ నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఆమె గ్లామర్ డోసు పెంచింది. దీంతో సమంతపై నెగెటివ్ కామెంట్లు ఇంకా ఎక్కువయ్యాయి. అసలే చైతూకు విడాకులు ఇచ్చిందని చెప్పి ఆమెపై అక్కినేని ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఈ సమయంలో ఆమె ఇలాంటి దుస్తులను ధరిస్తూ వారిని మరింత రెచ్చగొడుతోంది. వారికి నెగెటివ్ కామెంట్లు పెట్టేందుకు మరింత అవకాశం ఇచ్చినట్లు అవుతోంది.
ఇక తాజాగా సమంత బ్లాక్ కలర్ బ్రా లాంటి డ్రెస్‌లో ఎద అందాలన్నింటినీ చూపిస్తూ గ్లామర్ షో చేసింది. ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో కొద్ది గంటల్లోనే ఆ ఫొటో వైరల్ అయింది. అయితే దీనిపై నెటిజన్లు దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. ఇంతకన్నా బట్టలు మొత్తం విప్పి తిరగొచ్చు కదా.. అవి కూడా ఎందుకు.. మరీ చండాలంగా ప్రవర్తిస్తోంది.. చూడలేకపోతున్నాం.. అంటూ నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఇలాంటి కామెంట్లు, విమర్శలను అసలు పట్టించుకోనని గతంలోనే సమంత చెప్పింది. కనుక ఇప్పుడు కూడా ఆమె పట్టించుకోదనే భావించవచ్చు.
ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం యశోద, ఖుషి అనే మూవీల షూటింగ్‌లతో బిజీగా ఉంది. యశోద ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ కాగా దీన్ని సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఆగస్టులో ఇది రిలీజ్ కానుంది. అలాగే ఖుషి సినిమాలో ఈమె విజయ్ దేవరకొండ పక్కన నటిస్తోంది. ఈ మూవీని డిసెంబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో రణవీర్ సింగ్‌తో ఓ మూవీ చేస్తుందని వార్తలు వచ్చాయి. అతనితో కలసి ఉన్న ఒక ఫొటోను కూడా ఆమె షేర్ చేసింది. దీంతో అతనితో సినిమా పక్కా అని సమాచారం అందుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…