Poonam Kaur : వారు ఎవ‌రి పిల్ల‌లు పూన‌మ్ ? నెటిజ‌న్ల ప్ర‌శ్న‌..!

April 30, 2022 2:31 PM

Poonam Kaur : మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల స‌మయంలో న‌టి పూన‌మ్ కౌర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం విదిత‌మే. ప్ర‌కాష్ రాజ్ విజ‌యం సాధిస్తే త‌నను మోసం చేసిన వ్య‌క్తి గురించి చెబుతాన‌ని ఈమె బ‌హిరంగంగా ప్ర‌క‌ట‌న చేసింది. త‌రువాత ఆ ట్వీట్‌ను ఆమె డిలీట్ చేసింది. కానీ ప్ర‌కాష్ రాజ్ అయితే గెల‌వ‌లేదు. దీంతో ఆమె ప్ర‌క‌ట‌న అలాగే ఉండిపోయింది. ఇక ఇలాంటి వివాదాస్ప‌ద ట్వీట్లు చేయ‌డంలో పూన‌మ్ కౌర్ ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటుంది. కానీ ట్వీట్లు చేశాక వాటిని డిలీట్ చేస్తుంటుంది.

netizen ask Poonam Kaur whose kids those are
Poonam Kaur

ఇక తాజాగా పూన‌మ్ కౌర్ మ‌రోమారు వార్త‌ల్లో నిలిచింది. సోష‌ల్ మీడియాలో ఈమె ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. అయితే ఆమె పెట్టే ట్వీట్లు వివాదాస్ప‌దం అయిన‌ట్లుగానే తాజాగా ఆమె పెట్టిన ఫొటో ఒక‌టి చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ఇద్ద‌రు పిల్ల‌లతో క‌లిసి దిగిన ఫొటోను షేర్ చేసిన పూన‌మ్ దానికి హ్యాపీనెస్ అనే కామెంట్ కూడా పెట్టింది. అయితే వారు ఎవ‌రి పిల్ల‌లు ? అనే విష‌యాన్ని మాత్రం ఆమె వెల్ల‌డించ‌లేదు. దీంతో నెటిజన్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు.

ఆ పిల్ల‌లు ఎవ‌రు పూన‌మ్ ? అని నెటిజ‌న్లు ఆమెను ప్ర‌శ్నిస్తున్నారు. అయితే అందుకు ఆమె స‌మాధానం చెప్ప‌లేదు. మ‌రి దీనికి ఆమె స‌మాధానం చెబుతుందో లేదో చూడాలి. ఇక వారు బంధువుల పిల్ల‌లు అయి ఉంటార‌ని తెలుస్తోంది. కాగా పూన‌మ్ కౌర్ వెండితెర‌కు దూరం అయి చాలా కాల‌మే అవుతోంది. ఇటీవ‌లే ఆమె మ‌ళ్లీ వెండితెర‌పై సంద‌డి చేసింది. ఆమె న‌టించిన నాతి చ‌రామి అనే సినిమా విడుద‌లైంది. అయితే ఈ మూవీ వ‌చ్చి వెళ్లిన‌ట్లు కూడా చాలా మందికి తెలియ‌దు. ఇక పూన‌మ్ కౌర్ సినిమాల క‌న్నా సోష‌ల్ మీడియాలోనే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ అనేక సామాజిక‌, సినిమా అంశాల ప‌ట్ల స్పందిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now