Sania Mirza : సానియా మీర్జా పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ భారీ ట్రోలింగ్.. ఎందుకంటే ?

November 13, 2021 10:16 PM

Sania Mirza : భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా భారత దేశ పౌరసత్వాన్ని రద్దు చేయాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా కు టాగ్ చేస్తూ ఈమె పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈమె పౌరసత్వాన్ని ఎందుకు రద్దు చేయాలి అనే విషయానికి వస్తే.. టీ20 ప్రపంచకప్ 2021 లో గురువారం ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

netizen angry over Sania Mirza and demand to cancel her indian citizenship

ఈ మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్‌లో భాగంగా పాకిస్థాన్ క్రికెటర్లను ఉత్సాహపరిచేందుకు వెళ్ళిన సానియా మీర్జా.. పాకిస్థాన్ క్రికెటర్లను ప్రోత్సహిస్తూ స్టేడియంలో కనిపించడంతో ఎంతో మంది నెటిజన్లు ఈమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆమెపై దారుణంగా ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఆమెపై ఉపా చట్టం పెట్టి దేశ పౌరసత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె పాకిస్తాన్ కి మద్దతు తెలపడంతో చాలామంది శత్రు దేశానికి ఎలా మద్దతు తెలుపుతారు.. అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పాక్ పేసర్ హసన్ అలీ భార్యని, తన కుటుంబ సభ్యులను కూడా పాకిస్తాన్ ప్రజలు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అతను చివరి ఓవర్లలో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ క్యాచ్‌ పట్టలేదు. దీంతో పాక్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఆ దేశ ప్రజలు తమ బ్యాట్స్‌మన్‌ను ట్రోల్‌ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now