Neha Shetty : మెహబూబా సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ నేహా శెట్టి. ఈ అమ్మడు రీసెంట్‌గా డీజే టిల్లు చిత్రంతో పలకరించింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. ఇందులో నేహా శెట్టి పర్‌ఫార్మెన్స్‌కి ప్రతి ఒక్కరూ మంత్ర ముగ్ధులు అయ్యారు. ఈ సినిమాలో రాధికగా మెప్పించిన నేహా శెట్టి.. డీజే టిల్లు గురించి చేసిన ఎమోషనల్ పోస్ట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక ప్రస్తుతం ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయతో జతకట్టింది. ఈ సినిమా ఇటీవల లాంచింగ్ కార్యక్రమం జరుపుకుంది.
డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిదని దర్శకుడు క్రాక్స్ అన్నాడు. కార్తికేయకు ఇదొక డిఫరెంట్ సినిమా. కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిస్తున్నామని నిర్మాత బెన్నీ ముప్పనేని తెలిపాడు. అయితే నేహా శెట్టి సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. తన అందచందాలతో కుర్రకారు మనసులు దోచుకుంటూనే అప్పుడప్పుడు ఆసక్తికర విషయాలు తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా తన మనసులో ఉన్న కోరికని బయటపెట్టి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
నేహా శెట్టి రానున్న రోజులలో మహేష్.. రామ్ చరణ్.. బన్నీ.. లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేయాలని టార్గెట్ గా పెట్టుకుందట. బన్నీ సరసన ఓ యాడ్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ వెండితెర ఛాన్స్ కోసం గట్టిగానే ఎదురుచూస్తోంది. మరి ఈ అమ్మడి కోరిక ఎప్పుడు నిజం అవుతుందో అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేహా శెట్టి ఖాతాలో ఇప్పుడు పలు ఆఫర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ మధ్య తన పుట్టు మచ్చల గురించి ఓ జర్నలిస్ట్ తప్పుడు ప్రశ్న వేయగా దీటుగా బదులు చెప్పింది. ట్రైలర్ లాంచ్‌లో ఈ ప్రశ్న అడగడం చాలా దురదృష్టకరం. ఇది తన పట్ల, తన చుట్టూ వర్క్ ప్లేస్‌లో, ఇంట్లో ఉన్న మహిళల పట్ల ఆయనకెంత గౌరవం ఉందో తెలియజేస్తుందని ఆమె ట్వీట్ చేసింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…