Neha Shetty : డీజే టిల్లు బ్యూటీకి ఆ కోరిక ఉంద‌ట‌.. ఎప్పుడు తీరుతుందో మ‌రి..!

April 26, 2022 7:14 PM

Neha Shetty : మెహ‌బూబా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ నేహా శెట్టి. ఈ అమ్మ‌డు రీసెంట్‌గా డీజే టిల్లు చిత్రంతో ప‌ల‌క‌రించింది. చిన్న సినిమాగా విడుద‌లైన ఈ చిత్రం పెద్ద విజ‌యం సాధించింది. ఇందులో నేహా శెట్టి ప‌ర్‌ఫార్మెన్స్‌కి ప్రతి ఒక్క‌రూ మంత్ర ముగ్ధులు అయ్యారు. ఈ సినిమాలో రాధికగా మెప్పించిన నేహా శెట్టి.. డీజే టిల్లు గురించి చేసిన‌ ఎమోషనల్ పోస్ట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక ప్ర‌స్తుతం ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ‌తో జ‌త‌క‌ట్టింది. ఈ సినిమా ఇటీవ‌ల లాంచింగ్ కార్య‌క్ర‌మం జ‌రుపుకుంది.

Neha Shetty wants to act with ram charan and allu arjun
Neha Shetty

డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిదని దర్శకుడు క్రాక్స్ అన్నాడు. కార్తికేయకు ఇదొక డిఫరెంట్ సినిమా. కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిస్తున్నామని నిర్మాత బెన్నీ ముప్ప‌నేని తెలిపాడు. అయితే నేహా శెట్టి సినిమాల‌తో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తుంటుంది. త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌న‌సులు దోచుకుంటూనే అప్పుడ‌ప్పుడు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తూ ఉంటుంది. తాజాగా త‌న మ‌న‌సులో ఉన్న కోరిక‌ని బ‌య‌ట‌పెట్టి అంద‌రికీ ఆశ్చర్యాన్ని క‌లిగించింది.

నేహా శెట్టి రానున్న రోజుల‌లో మహేష్.. రామ్ చరణ్.. బన్నీ.. లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేయాలని టార్గెట్ గా పెట్టుకుంద‌ట‌. బన్నీ సరసన ఓ యాడ్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ‌ వెండితెర ఛాన్స్ కోసం గట్టిగానే ఎదురుచూస్తోంది. మ‌రి ఈ అమ్మ‌డి కోరిక ఎప్పుడు నిజం అవుతుందో అని ప్ర‌తి ఒక్క‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. నేహా శెట్టి ఖాతాలో ఇప్పుడు ప‌లు ఆఫ‌ర్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆ మ‌ధ్య త‌న పుట్టు మ‌చ్చ‌ల గురించి ఓ జ‌ర్న‌లిస్ట్ త‌ప్పుడు ప్ర‌శ్న వేయ‌గా దీటుగా బ‌దులు చెప్పింది. ట్రైలర్ లాంచ్‌లో ఈ ప్రశ్న అడగడం చాలా దురదృష్టకరం. ఇది తన పట్ల, తన చుట్టూ వర్క్ ప్లేస్‌లో, ఇంట్లో ఉన్న మహిళల పట్ల ఆయనకెంత గౌరవం ఉందో తెలియజేస్తుంద‌ని ఆమె ట్వీట్ చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment