Neha Shetty : పుట్టు మ‌చ్చ‌ల సంఖ్య విష‌యంపై డీజే టిల్లు భామ నేహా శెట్టి స్పంద‌న‌..!

February 5, 2022 9:28 AM

Neha Shetty : సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన తాజా చిత్రం.. డీజే టిల్లు. ఈ మూవీ ట్రైల‌ర్ ఇటీవ‌లే విడుద‌ల కాగా.. అది ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అందులో హీరో సిద్ధు డైలాగ్స్‌, మ్యాన‌రిజంతోపాటు హీరోయిన్ నేహా శెట్టి అందాల ఆర‌బోత‌, గ్లామ‌ర్ షోకు యువ‌త ఫిదా అయ్యారు. దీంతో విడుద‌లైన కొన్ని గంటల్లోనే ఈ ట్రైల‌ర్ వైర‌ల్‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ మూవీ గురించి చాలా మంది చ‌ర్చించుకుంటున్నారు.

Neha Shetty  responded over recent incident in dj tillu trailer launch event
Neha Shetty

ఇక ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ సందర్భంగా నిర్వ‌హించిన ప్రెస్ మీట్‌లో హీరోయిన్ నేహా శెట్టిని ఓ ఫిలిం జ‌ర్న‌లిస్టు అనుచిత ప్ర‌శ్న అడిగాడు. సినిమాలో హీరో నీ శ‌రీరంపై పుట్టు మ‌చ్చ‌లు ఎన్ని ఉన్నాయంటే అందుకు మీరు 16 అని చెప్పారు. నిజంగానే మీ శ‌రీరంపై ఉన్న పుట్టు మ‌చ్చ‌ల‌ను సిద్ధు అడిగి తెలుసుకున్నారా.. ఆయ‌న‌కు చెప్పారా.. అంటూ ఆ జ‌ర్న‌లిస్టు నేహాను అడిగాడు. దీంతో అక్క‌డే ఉన్న సిద్ధు ఆ ప్ర‌శ్న‌ను వ‌దిలేద్దాం.. అని చెప్పారు.

అయితే ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ జ‌ర్న‌లిస్టు అలాంటి ప్ర‌శ్న అడ‌గ‌డంపై నేహా అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఇందుకు గాను నిర్మాత ఆమెకు క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో మాత్రం చ‌ర్చ‌కు దారి తీసింది. దీంతో కొంద‌రు నెటిజ‌న్లు ఆమెకు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఇక కొంద‌రు మాత్రం ఆమెను విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే త‌న‌పై వ‌స్తున్న ట్రోల్స్‌కు నేహా స్పందించింది.

తాజాగా ఇదే విష‌యంపై ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. త‌న‌ను ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా విమ‌ర్శించినా.. ట్రోల్ చేసినా.. ప‌ట్టించుకోన‌ని.. త‌నపై అవి ప్ర‌భావం చూపించ‌లేవ‌ని తెలియజేసింది. తాను గ‌డిచిన సంఘ‌ట‌న‌ల గురించి ఆలోచిస్తూ టైమ్ వేస్ట్ చేయ‌న‌ని.. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ల‌ను వేసుకుంటాన‌ని చెప్పింది. తాను ప్రస్తుతం సినిమా కెరీర్ ప‌రంగా సంతోషంగానే ఉన్నాన‌ని.. త‌న‌కు వ‌చ్చే అవ‌కాశాల‌ను వ‌దులుకోకుండా చేస్తాన‌ని చెప్పింది. క‌థ మంచిగా అనిపిస్తే న‌టిస్తాన‌ని.. త‌న‌కు న‌ట‌న‌లో ఎలాంటి కండిష‌న్స్ లేవ‌ని, ఎలాంటి పాత్ర అయినా చేస్తాన‌ని చెప్పింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now