Neha Shetty : డీజే టిల్లు హీరోయిన్ శ‌రీరంపై ఉన్న పుట్టు మ‌చ్చ‌ల‌పై ప్ర‌శ్న‌.. అస‌హ‌నం వ్య‌క్తం చేసిన నేహా శెట్టి..

February 4, 2022 8:26 AM

Neha Shetty : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం.. డీజే టిల్లు. ఈ సినిమాని సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. విమల కృష్ణ దర్శకత్వం వహించారు. ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన ఈ మూవీ విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలోనే చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్‌ను వేగవంతం చేసింది.

Neha Shetty feel embarrassed for a journalist question
Neha Shetty

ఈ మూవీకి చెందిన ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌ను ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. అయితే ఈ ఈవెంట్‌లో ఓ జ‌ర్న‌లిస్టు చిత్ర యూనిట్‌ను ఇబ్బంది పెట్టే ప్ర‌శ్న అడిగాడు. చిత్ర ట్రైల‌ర్‌లో హీరో హీరోయిన్‌ను నీ ఒంటి మీద ఎన్ని పుట్టు మ‌చ్చ‌లు ఉన్నాయి.. అని అడుగుతాడు. దీంతో హీరోయిన్ 16 అని చెబుతుంది. అయితే ఇదే విష‌యాన్ని తీసుకున్న స‌ద‌రు జ‌ర్న‌లిస్టు హీరోయిన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీ ఒంటి మీద నిజంగానే 16 పుట్టు మ‌చ్చ‌లు ఉన్నాయా, హీరో ఆ విష‌యం నిర్దారించుకున్నాడా.. అని అడిగాడు.

అయితే ఈ ప్ర‌శ్న‌కు ఒక్క‌సారిగా షాక్ అయిన సిద్ధు.. దీన్ని అవాయిడ్ చేద్దామ‌ని అన్నాడు. కానీ నేహా శెట్టి మాత్రం దీన్ని సీరియ‌స్‌గానే తీసుకుంది. త‌రువాత ఆమె ట్విట్ట‌ర్ లో ఈ విష‌యంపై పోస్ట్ పెట్టింది. ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం చాలా దుర‌దృష్ట‌క‌రం అని, అలాంటి జ‌ర్న‌లిస్టుల‌కు స్త్రీల ప‌ట్ల‌, త‌న చుట్టూ కుటుంబంలో, ప‌నిచేసే చోట ఉండే మ‌హిళ‌ల ప‌ట్ల ఎంత‌టి గౌర‌వం ఉందో తెలుస్తూనే ఉంద‌ని.. పోస్ట్ పెట్టింది.

ఇక దీనిపై నిర్మాత నాగ‌వంశీ హీరోయిన్‌కు క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పార‌ట‌. అయితే ఈ మ‌ధ్య కాలంలో యూట్యూబ్ చాన‌ల్స్ బాగా పుట్టుకొచ్చి.. మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థ‌ల‌కు చెందిన ఫిలిం జ‌ర్న‌లిస్టులు ఈవెంట్ల‌కు హాజ‌రు కావ‌డం లేదు. దీంతో యూట్యూబ్ చానల్స్ నుంచి కొంద‌రు తాము జ‌ర్న‌లిస్టుల‌మ‌ని చెప్పుకుంటూ ఇలాంటి ప్రెస్ మీట్ ల‌కు, ఈవెంట్‌ల‌కు వ‌స్తున్నారు. వారికి ఏం ప్ర‌శ్న‌లు అడ‌గాలో తెలియ‌డం లేదు. అందుక‌నే ఇలాంటి సంఘ‌ట‌న జ‌రిగింద‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now