Aryan Khan : బిగ్‌ బ్రేకింగ్‌.. డ్రగ్స్‌ కేసులో షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టు..

October 3, 2021 4:34 PM

Aryan Khan : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు అరెస్టు చేశారు. శనివారం రాత్రి ముంబై సముద్ర తీరంలో ఓ క్రూయిజ్‌ షిప్‌లో డ్రగ్స్‌, గంజాయి, కొకెయిన్ సరఫరా అవుతుందన్న సమాచారం మేరకు ఎన్‌సీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఈ క్రమంలోనే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Aryan Khan : బిగ్‌ బ్రేకింగ్‌.. డ్రగ్స్‌ కేసులో షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టు..

కాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌సీబీ అధికారులు ఆర్యన్‌ ఖాన్‌ను విచారణ నిమిత్తం అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ఆర్యన్‌ ఖాన్‌కు ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. తరువాత అతన్ని ప్రశ్నించనున్నారు.

షారుఖ్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టు అవడం సంచలనం సృష్టిస్తోంది. ఇటీవలి కాలంలో అటు బాలీవుడ్‌ సహా ఇటు టాలీవుడ్‌ ఇండస్ట్రీలోనూ డ్రగ్స్‌ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ మాత్రం అసలు సూత్రధారులను వదిలేసి చిన్న చేపలను పట్టుకున్నారని ఆరోపిస్తోంది. కాగా ఈ కేసులో ఆర్యన్‌ తో పాటు మరో 10 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం అందుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now