NBK107 : భ‌యం అన్న‌ది నా బ‌యోడేటాలోనే లేదంటున్న బాల‌య్య‌.. ఎన్‌బీకే 107 టీజ‌ర్ అదుర్స్‌..!

June 9, 2022 9:10 PM

NBK107 : నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ షూటింగ్ కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. ఈ మూవీని ఎన్‌బీకే 107 వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కిస్తున్నారు. కాగా బాల‌కృష్ణ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఈ మూవీ నుంచి ప‌వ‌ర్‌ఫుల్ టీజ‌ర్‌ను తాజాగా లాంచ్ చేశారు. ఇందులో బాల‌కృష్ణ అదిరిపోయే ఊర‌మాస్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించారు. ప‌లు ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ చెబుతూ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

భ‌యం అన్న‌ది నా బ‌యోడేటాలోనే లేద‌న్న బాల‌య్య‌.. న‌ర‌క‌డం మొద‌లు పెడితే పార్ట్‌ల‌ను చూసి పెళ్లాలే గుర్తు పట్ట‌రు.. అని బాల‌య్య చెప్పిన ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ గూస్ బంప్స్‌ను తెప్పిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ టీజ‌ర్‌లో బాల‌కృష్ణ న‌ల్ల‌ని దుస్తులు ధ‌రించి నుదుట‌న బొట్టు పెట్టుకుని చుట్ట తాగుతూ మాస్ క్యారెక్ట‌ర్‌లో అల‌రించారు. ఇక ఈ సినిమాలో ఆయ‌న ఓ ఊరి పెద్ద పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని.. మైనింగ్ చుట్టూ న‌డిచే క‌థ‌ని తెలుస్తోంది. ఇందులో బాల‌య్య భిన్న‌మైన గెట‌ప్ లో అల‌రించ‌నున్నారు. బాల‌య్య‌కు జోడిగా ఇందులో శృతి హాస‌న్ న‌టిస్తోంది.

NBK107 Balakrishna latest movie teaser out
NBK107

ఇక ఈ మూవీలో లేడీ విల‌న్ క్యారెక్ట‌ర్‌లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ న‌టిస్తున్నారు. ఆమె గ‌తేడాది గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన క్రాక్ సినిమాలోనూ విల‌న్‌గా న‌టించి అల‌రించారు. కాగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ ఈ మూవీ ద్వారా తెలుగు తెర‌కు విల‌న్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇక ఈ మూవీకి అన్న‌గారు అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now